తెలుగు న్యూస్  /  ఫోటో  /  Weight Loss Tips : వీటితో మీ చిరుతిళ్లను రిప్లేస్ చేయండి.. బరువు తగ్గుతారు..

Weight Loss Tips : వీటితో మీ చిరుతిళ్లను రిప్లేస్ చేయండి.. బరువు తగ్గుతారు..

29 July 2022, 13:37 IST

Snacks for Weight Loss: కొందరికీ తరచూ ఆకలి వేస్తుంది. దీనివల్ల వాళ్లు ఎక్కువగా తినేస్తూ ఉంటారు. ఎక్కువగా తింటే బరువు పెరిగిపోతాము. పైగా స్నాక్స్ కింది వేయించిన పదార్థాలు ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు కూడా వచ్చేస్తాయి. అయితే బరువు తగ్గడానికి, ఆరోగ్యాన్ని ఇచ్చే స్నాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్నిసార్లు ఏమి చేసినా బరువు తగ్గము. పైగా వ్యాయామాల వల్ల ఒక్కోసారి ఎక్కువగా తినేస్తాము. అయితే ఆకలిని అదుపులో ఉంచి.. మీ కడుపును ఫుల్ చేసే స్నాక్స్ మీరు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. అయితే ఆ స్నాక్స్ ఏంటో మీరే తెలుసుకోండి.
(1 / 9)

ద్రాక్ష: ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని కాలుష్య కారకాలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. అలాగే దీన్ని తింటే చాలా సేపు పొట్ట నిండుగా ఉంటుంది.
(2 / 9)

బాదం: బాదం పప్పు తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. ఇది కాకుండా ఈ గింజ రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తక్కువగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
(3 / 9)

పాప్‌కార్న్: ఈ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అంతేకాక, కేలరీల పరిమాణం తక్కువగా ఉంటుంది. సాయంత్రం స్నాక్‌గా తినవచ్చు. సాధారణంగా కాల్చిన పాప్‌కార్న్ తినాలి. వేయించిన పాప్‌కార్న్ కాదు.
(4 / 9)

బెర్రీస్: ఈ పండ్లలో కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఎక్కువ సేపు పొట్ట నిండుగా ఉంచుతుంది. ఇతర ఆహారాలు తినాలనే కోరిక తగ్గుతుంది. కాబట్టి మీరు తినవచ్చు. బరువు తగ్గుతారు.
(5 / 9)

డార్క్ చాక్లెట్: ఇది మీ ఆకలిని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు ఈ చాక్లెట్‌లో అనేక ఇతర పోషక గుణాలు ఉన్నాయి. ఇది నిద్రను మెరుగుపరుస్తుంది. ఓవరాల్​గా బరువు తగ్గాలంటే ఈ చాక్లెట్ తినొచ్చు.
(6 / 9)

క్యారెట్: క్యారెట్‌లో క్యాలరీలు తక్కువగా ఉన్నప్పటికీ.. పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీకు ఆకలిగా అనిపించినప్పుడల్లా కొన్ని క్యారెట్ ముక్కలను తినండి. కడుపు నిండుతుంది. 
(7 / 9)

కొబ్బరి: కొబ్బరి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లను కలిగి ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మీకు ఆకలిగా అనిపించినప్పుడు కొబ్బరి ముక్క తినండి. మీ ఆకలి తీరుతుంది. బరువు కూడా అదుపులో ఉంటుంది. 
(8 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి