Evening Snacks : సాయంకాలం వేళ పొటాటో రింగ్స్ లాగిస్తే.. ఆహా అనాల్సిందే..-evening snacks recipe potato rings here is the ingredients and details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Evening Snacks : సాయంకాలం వేళ పొటాటో రింగ్స్ లాగిస్తే.. ఆహా అనాల్సిందే..

Evening Snacks : సాయంకాలం వేళ పొటాటో రింగ్స్ లాగిస్తే.. ఆహా అనాల్సిందే..

Geddam Vijaya Madhuri HT Telugu
Jun 18, 2022 05:02 PM IST

ఈవెనింగ్ స్నాక్స్ తినాలని అనిపించినప్పుడు సులభంగా, రుచికరమైన స్నాక్స్ తినాలనుకుంటే.. బంగాళాదుంపతో రింగ్స్ తయారు చేసుకోవచ్చు. టీతో పాటు వీటిని లాగిస్తే.. సాయంత్రం హాయిగా గడిచిపోతుంది.

<p>పొటాటో రింగ్స్</p>
పొటాటో రింగ్స్

Potato Rings : మధ్యాహ్నం భోజనం చేసినా.. సాయంత్రం ఏదొక సమయంలో ఆకలి వేస్తుంది. బయట నుంచి ఏమి తెచ్చుకోవాలని అనిపించకపోవచ్చు. అయితే మీరే చక్కగా, సింపుల్​గా ఇంట్లో తయారు చేసుకునే స్నాక్​ ఒకటి సిద్ధంగా ఉంది. అది ఎలా తయారు చేసుకోవాలో.. ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* చిల్లీ ఫ్లేక్స్ - 1 టీస్పూన్

*  వెల్లుల్లి - మూడు రెబ్బలు

* ఒరేగానో - 1 టీస్పూన్

* ఉప్పు - రుచికి తగినంత

* బంగాళదుంపలు - 2 (ఉడికించినవి)

* రవ్వ - 1/4 కప్పు

* నూనె -  వేయించడానికి సరిపడా

తయారీ విధానం

ఒక పాన్‌లో కొంచెం వెన్న తీసుకుని వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానో వేయాలి. అది వేయించిన తర్వాత కొంచెం నీళ్లు వేయాలి. అది మరిగిన తర్వాత రవ్వ వేయాలి. రవ్వ ఉడికిన తర్వాత.. చల్లారనివ్వాలి. తర్వాత దానిలో ఉడికించిన రెండు మెత్తని బంగాళదుంపలు వేసి.. పిండిని కలుపుకోవాలి.

ఈ పిండిని బాగా కలిపి చిన్న చిన్న రింగులుగా తయారు చేసుకోవాలి. వీటిని కాగుతున్న నూనెలో వేసి.. వేయించుకోవాలి. గోల్డెన్​ కలర్​ వచ్చే వరకు వేయించుకుని దించేసుకోవాలి. సాయంత్రం టీ తాగినప్పుడు వేడివేడిగా ఇవి చేసుకుని లాగించేయండి.

Whats_app_banner