తెలుగు న్యూస్  /  ఫోటో  /  Monsoon Tips : వర్షాకాలంలో చలిని తగ్గించుకోవాలంటే.. పసుపు కలిపిన పాలను తాగండి..

Monsoon Tips : వర్షాకాలంలో చలిని తగ్గించుకోవాలంటే.. పసుపు కలిపిన పాలను తాగండి..

08 July 2022, 14:45 IST

Monsoon Tips : వర్షాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తగ్గించుకోవాలంటే.. రాత్రి పడుకునేముందు పాలల్లో పసుపు కలిపి తాగాలి అంటున్నారు నిపుణులు. పసుపుతో పాటు మరికొన్ని కలిపి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయని అధ్యయనాలు చెప్తున్నాయి. మరి ఏ పదార్థాలు కలిపితే.. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Monsoon Tips : వర్షాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తగ్గించుకోవాలంటే.. రాత్రి పడుకునేముందు పాలల్లో పసుపు కలిపి తాగాలి అంటున్నారు నిపుణులు. పసుపుతో పాటు మరికొన్ని కలిపి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయని అధ్యయనాలు చెప్తున్నాయి. మరి ఏ పదార్థాలు కలిపితే.. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పసుపును గాయాలకు, సౌందర్య చికిత్సలలో కూడా ఉపయోగిస్తారు. పచ్చి పసుపు ఆహారాన్ని కూడా చాలామంది తీసుకుంటారు. కొందరు ఉదయాన్నే లేచి పచ్చి పసుపు కొమ్మును తింటారు. మరికొందరు రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగుతారు. పసుపు పాలలో చాలా ప్రయోజనాలు ఉన్నాయని వివిధ అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
(1 / 6)

ఒక కప్పు పాలను గిన్నెలో వేసి మరిగించండి. దానిలో టీస్పూన్ పసుపు వేయండి. దీనిని బాగా కలపాలి. రుచిని మెరుగుపరచడానికి చక్కెరకు బదులుగా తేనెను ఉపయోగించండి. కుదిరితే చిటికెడు కుంకుమపువ్వు, డ్రై ఫ్రూట్స్, దాల్చిన చెక్క పొడి లేదా అల్లం పొడిని వేసుకోవచ్చు. ఈ పాలను గోరువెచ్చగా తాగాలి.
(2 / 6)

పసుపు పాలు శరీరంలో మంటను తగ్గిస్తుంది. ఈ పాలలో దాల్చిన చెక్క, అల్లం కలిపి తీసుకోవడం వల్ల కూడా మంట తగ్గుతుంది. కీళ్ల నొప్పులు లేదా మరేదైనా కండరాల నొప్పి వచ్చినా పసుపు కలిపిన పాలు తాగండి. పాలు, పసుపు కలిపి తీసుకుంటే ఎముకలకు బలం చేకూరుతుంది.
(3 / 6)

పసుపు కలిపిన పాలలో జీర్ణక్రియకు సహాయపడే లక్షణాలు ఉంటాయి. ఇవి గ్యాస్, అపానవాయువు, అతిసారం వంటి ఇతర కడుపు సమస్యలను పరిష్కరిస్తాయి. కాబట్టి రాత్రి పడుకునే ముందు దీన్ని తాగడం మంచిది.
(4 / 6)

పసుపు కలిపిన పాలు రోజూ తీసుకుంటే చర్మ కాంతి కూడా పెరుగుతుంది. జలుబు వచ్చినా పసుపు కలిపిన పాలను తీసుకోండి. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే కర్కుమిన్ అనే క్రియాశీల పదార్ధం ఉంటుంది. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి