తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Lucky Plants| మీ ఇల్లు బంగారం కావాలంటే.. వాస్తు ప్రకారం ఈ మొక్కలు ఇంట్లో ఉండాలట

Lucky Plants| మీ ఇల్లు బంగారం కావాలంటే.. వాస్తు ప్రకారం ఈ మొక్కలు ఇంట్లో ఉండాలట

30 August 2022, 18:45 IST

Lucky Plants: ఇంట్లో మొక్కలను పెంచుకుంటే ఆ ఇంటికే అందం వస్తుంది. అయితే వాస్తు పరంగా కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకోవడం ద్వారా ఆ ఇంట్లో వారు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. వారి సంపద పెరుగుతుంది, ఆనందంగా ఉంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి లక్కీ ప్లాంట్స్ ఏవో చూసేయండి.

  • Lucky Plants: ఇంట్లో మొక్కలను పెంచుకుంటే ఆ ఇంటికే అందం వస్తుంది. అయితే వాస్తు పరంగా కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకోవడం ద్వారా ఆ ఇంట్లో వారు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. వారి సంపద పెరుగుతుంది, ఆనందంగా ఉంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి లక్కీ ప్లాంట్స్ ఏవో చూసేయండి.
ఇటీవలి సంవత్సరాలలో భారతదేశంలో చాలా మంది వాస్తును నమ్ముతారు. ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవటమే కాకుండా ఇంట్లో ప్రతీది వాస్తు ప్రకారమే ఉంచుతారు. ఆఖరుకు కొన్ని మొక్కలు కూడా వాస్తుపరంగా ఆ ఇంటికి ఎనలేని అదృష్టాన్ని కలిగిస్తాయని ప్రసిద్ధి చెందాయి.
(1 / 7)
ఇటీవలి సంవత్సరాలలో భారతదేశంలో చాలా మంది వాస్తును నమ్ముతారు. ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవటమే కాకుండా ఇంట్లో ప్రతీది వాస్తు ప్రకారమే ఉంచుతారు. ఆఖరుకు కొన్ని మొక్కలు కూడా వాస్తుపరంగా ఆ ఇంటికి ఎనలేని అదృష్టాన్ని కలిగిస్తాయని ప్రసిద్ధి చెందాయి.(Unsplash)
మనీ ప్లాంట్: ఇది చాలా సులభంగా పెరిగే మొక్క. ఈ మొక్కను పెంచుకుంటే ఇది మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుతుంది. ఇంటికి ఆగ్నేయం లేదా ఈశాన్య దిశలలో మొక్కను ఉంచడం మంచిది. ఈ మొక్క ద్వారా ఆ ఇంటికి అదృష్టం వరిస్తుంది. ఇంట్లోని వారి సంపద పెరుగుతుంది.
(2 / 7)
మనీ ప్లాంట్: ఇది చాలా సులభంగా పెరిగే మొక్క. ఈ మొక్కను పెంచుకుంటే ఇది మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుతుంది. ఇంటికి ఆగ్నేయం లేదా ఈశాన్య దిశలలో మొక్కను ఉంచడం మంచిది. ఈ మొక్క ద్వారా ఆ ఇంటికి అదృష్టం వరిస్తుంది. ఇంట్లోని వారి సంపద పెరుగుతుంది.(Unsplash)
తులసి మొక్క : ఈ మొక్క దాదాపు ప్రతి హిందూ గృహంలో కనిపిస్తుంది. ఇది చాలా పవిత్రమైనదిగా భావించి పూజలు చేస్తారు. ఈ మొక్క నేచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్‌గా పనిచేస్తుంది, దీని ఆకులు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. శరీరం నుండి విషాన్ని తొలగించగలవు. తులసి మొక్కను ఇంటికి తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలలో ఉంచాలి.
(3 / 7)
తులసి మొక్క : ఈ మొక్క దాదాపు ప్రతి హిందూ గృహంలో కనిపిస్తుంది. ఇది చాలా పవిత్రమైనదిగా భావించి పూజలు చేస్తారు. ఈ మొక్క నేచురల్ ఎయిర్ ప్యూరిఫైయర్‌గా పనిచేస్తుంది, దీని ఆకులు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. శరీరం నుండి విషాన్ని తొలగించగలవు. తులసి మొక్కను ఇంటికి తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలలో ఉంచాలి.(Unsplash)
లక్కీ బాంబూ మొక్క: ఆరు కాండల వెదురు మొక్క ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోని వారికి అదృష్టాన్ని, శ్రేయస్సును తెస్తుందని, ఏడు కాండల మొక్క ఉంటే ఆరోగ్యాన్ని తెస్తుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం ఈ మొక్క ఇంటి తూర్పు లేదా ఆగ్నేయ మూలలో ఉంచాలి.
(4 / 7)
లక్కీ బాంబూ మొక్క: ఆరు కాండల వెదురు మొక్క ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోని వారికి అదృష్టాన్ని, శ్రేయస్సును తెస్తుందని, ఏడు కాండల మొక్క ఉంటే ఆరోగ్యాన్ని తెస్తుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం ఈ మొక్క ఇంటి తూర్పు లేదా ఆగ్నేయ మూలలో ఉంచాలి.(Pinterest)
కలబంద మొక్క: ఈ మొక్క పలు ఔషధ గుణాలకు ప్రసిద్ధి. ముఖ్యంగా చర్మ సంరక్షణ, కేశ సంరక్షణ కోసం ఇది ఒక స్టార్. ఈ మొక్క గాలిని శుద్ధి చేస్తుంది. మెరుగైన జీర్ణక్రియ కోసం కూడా వాడతారు. కలబంద ఇంట్లో ఉంటే పాజిటివ్ వైబ్స్ ఉంటాయని నమ్ముతారు. ఈ మొక్కను ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచాలి.
(5 / 7)
కలబంద మొక్క: ఈ మొక్క పలు ఔషధ గుణాలకు ప్రసిద్ధి. ముఖ్యంగా చర్మ సంరక్షణ, కేశ సంరక్షణ కోసం ఇది ఒక స్టార్. ఈ మొక్క గాలిని శుద్ధి చేస్తుంది. మెరుగైన జీర్ణక్రియ కోసం కూడా వాడతారు. కలబంద ఇంట్లో ఉంటే పాజిటివ్ వైబ్స్ ఉంటాయని నమ్ముతారు. ఈ మొక్కను ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచాలి.(Unsplash)
స్నేక్ ప్లాంట్: వాస్తు పరంగా ఇది కూడా ఒక లక్కీ ప్లాంట్. ఈ మొక్క గాలిని శుద్ధి చేస్తుంది. దక్షిణం, తూర్పు లేదా ఆగ్నేయ దిశలలో పెంచుకుంటే ఇంట్లో సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుందని నమ్ముతారు.
(6 / 7)
స్నేక్ ప్లాంట్: వాస్తు పరంగా ఇది కూడా ఒక లక్కీ ప్లాంట్. ఈ మొక్క గాలిని శుద్ధి చేస్తుంది. దక్షిణం, తూర్పు లేదా ఆగ్నేయ దిశలలో పెంచుకుంటే ఇంట్లో సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుందని నమ్ముతారు.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి