Vinca Plant | ఈ అందమైన పూల మొక్క ఇంటికి అందాన్ని, ఒంటికి ఆరోగ్యాన్ని అందిస్తుంది-this beautiful vinca plant has many health benefits check details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vinca Plant | ఈ అందమైన పూల మొక్క ఇంటికి అందాన్ని, ఒంటికి ఆరోగ్యాన్ని అందిస్తుంది

Vinca Plant | ఈ అందమైన పూల మొక్క ఇంటికి అందాన్ని, ఒంటికి ఆరోగ్యాన్ని అందిస్తుంది

HT Telugu Desk HT Telugu
Aug 10, 2022 10:37 PM IST

ఎవర్ గ్రీన్ ప్లాంట్ ఇంట్లో పెంచుకుంటే ఇంటికి అలంకరణగా మాత్రమే కాదు. ఈ మొక్కతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వివరాలు చూడండి..

<p>Vinca Plant</p>
Vinca Plant (Pixabay)

ఇంట్లో పెంచుకునేందుకు చాలా రకాల మొక్కలు ఉంటాయి. అయితే ఎవర్ గ్రీన్ ప్లాంట్ గురించి మీరు విన్నారా? ఇది సీజన్లకు అతీతంగా ఆకుపచ్చగా ఉంటుంది. మీ బాల్కనీలో ఎవర్ గ్రీన్ ప్లాంట్ పెంచుకుంటే అవి ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

దీనిని ఆంగ్లంలో Vinca ప్లాంట్ అని కూడా అంటారు. దీనికి ఐదు రేకుల పువ్వు పూస్తుంది. ఇది తెలుపు, గులాబీ, ఫల్సాయ్, ఊదా మొదలైన రంగులతో ఉంటుంది. ఈ ఎవర్ గ్రీన్ పువ్వులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఎలాంటి వ్యాధులను దూరం చేస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.

మధుమేహాన్ని నయం చేస్తుంది

ఎవర్ గ్రీన్ వేర్లు రక్తంలో చక్కెరను తగ్గించే గుణం కలిగి ఉంటాయి. ఇది ప్యాంక్రియాస్ బీటా కణాలకు బలాన్ని ఇస్తుంది, దీని నుండి ప్యాంక్రియాస్ సరైన మొత్తంలో ఇన్సులిన్‌ను బయటకు పంపిస్తుంది. ఇన్సులిన్ అనేది రక్తంలో చక్కెర పరిమాణాన్ని సమతుల్యం చేసే హార్మోన్.

అధిక రక్త పోటు

ఎవర్ గ్రీన్ మొక్కల వేర్లలో అజ్మాలిసిన్, సర్పెంటైన్ అనే ఆల్కలాయిడ్‌లు ఉంటాయి. ఇవి యాంటీ సెన్సిబుల్. వీటి గుణాలు అధిక రక్తపోటును నియంత్రించటంలో ఉపయోగకరంగా ఉంటాయి. వీటి వేర్లను శుభ్రం చేసి, ఉదయాన్నే నమలడం వల్ల అధిక రక్తపోటు నుంచి గొప్ప ఉపశమనం లభిస్తుంది.

కడుపుకు మేలు చేస్తుంది

ఎవర్ గ్రీన్ మొక్క వేర్లు పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఉపయోగిస్తారు. మలబద్ధకం లేదా ఇతర ఉదర వ్యాధులు ఉన్నవారికి కూడా ఈ మొక్క చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

నోరు, ముక్కు నుండి రక్తస్రావం నివారణకు

Vinca మొక్క ప్రస్తావన ఏడవ శతాబ్దంలో బ్రిటీష్ వైద్య శాస్త్రంలో ఉంది. కల్ప్‌చార్ అనే బ్రిటీష్ మూలికా నిపుణుడు నోరు, ముక్కు నుండి రక్తస్రావం నిలపటానికి ఈ మొక్క ఒక ఔషధంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. స్కర్వీ, డయేరియా, గొంతు నొప్పి, టాన్సిల్స్‌ రక్తస్రావం మొదలైన వాటికి ఈ మొక్కను ఔషధ మూలికగా ఉపయోగిస్తారు.

డిఫ్తీరియా వ్యాధిని నయం చేస్తుంది

ఎవర్ గ్రీన్ మొక్క ఆకుల్లో ఉండే విండోలిన్ అనే ఆల్కలాయిడ్ సమ్మేళ్లనం డిఫ్తీరియా బాక్టీరియయాకు వ్యతిరేకంగా చురుకుగా పనిచేస్తుంది. అందువల్ల, దాని ఆకుల సారాన్ని డిఫ్తీరియా వ్యాధి చికిత్సలో ఉపయోగించవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం