తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Spices To Avoid During Summer | మీ వంటల్లో ఇవి వేస్తున్నారా? అయితే జాగ్రత్త..

Spices to Avoid During Summer | మీ వంటల్లో ఇవి వేస్తున్నారా? అయితే జాగ్రత్త..

03 June 2022, 10:15 IST

వంటల్లో మసాలా దినుసులను వేయడం వల్ల ఆహారం మరింత రుచికరంగా మారుతుంది. కొన్ని మసాలాల వల్ల మన శరీరానికి మేలు జరుగుతుంది. కానీ అవి సమ్మర్​లో వాడటం అంత మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు. ఇంతకీ ఆ మసాలాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాటిని దూరంగా ఉంచి సమ్మర్​ను బీట్​ చేద్దాం. 

  • వంటల్లో మసాలా దినుసులను వేయడం వల్ల ఆహారం మరింత రుచికరంగా మారుతుంది. కొన్ని మసాలాల వల్ల మన శరీరానికి మేలు జరుగుతుంది. కానీ అవి సమ్మర్​లో వాడటం అంత మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు. ఇంతకీ ఆ మసాలాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాటిని దూరంగా ఉంచి సమ్మర్​ను బీట్​ చేద్దాం. 
సాధారణంగా కొన్ని మసాలాలు పొట్టకు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా శరీరానికి అద్భుతాలు చేస్తాయన్నారు. అయితే ఆ మసాలాలు వేసవిలో మాత్రం తీసుకోవద్దు అంటున్నారు. ఇవి శరీరానికి అసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉందంటున్నారు. ఇంతకీ వంటలోకి చేర్చుకోకూడని మసాలాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
(1 / 6)

కారాన్ని ఉపయోగించడం వల్ల వంటకు రూపం, భిన్నమైన మెరుపు వస్తుంది. అయితే ఎండవేడిమి అధికంగా ఉన్న రోజుల్లో ఎర్ర కారంతో వండిన ఆహారాన్ని తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. కారం ఆహారం ద్వారా పొట్టలోకి చేరిన వెంటనే చికాకు కలిగిస్తుందని వెల్లడించారు. చాలా మందికి గొంతు నొప్పులు కూడా వచ్చే అవకాశమున్నదని స్పష్టం చేశారు. అలాగే ఎర్ర మిరప పొడి శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది.
(2 / 6)

వెల్లుల్లి బరువు తగ్గడంలో సహాయపడుతుందనేది నిజమే అయినప్పటికీ.. దానిలో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. జలుబుకు వెల్లుల్లి చాలా మంచిది. అయితే ఎండాకాలం కంటే చలికాలంలో వెల్లుల్లి ఎక్కువగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. 
(3 / 6)

వేడి వాతావరణంలో వెల్లుల్లిని తక్కువగా తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. వేడి వాతావరణంలో ఎసిడిటీ సమస్యలను కూడా కలిగిస్తుంది. అందుకే వేడి వాతావరణంలో వెల్లుల్లి తినకూడదని చాలా మంది సలహా ఇస్తున్నారు.
(4 / 6)

అల్లం రుచి బాగా ఘాటుగా ఉంటుంది. కాబట్టి వేడి వాతావరణంలో ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. వేడి ఎక్కువున్న రోజున దీనిని తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, కడుపు నొప్పి, విరేచనాలు అయ్యే ప్రమాదముంది. 
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి