తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lamborghini Aventador Ultimae । భారత్‌కు దూసుకొచ్చిన లిమిటెడ్ ఎడిషన్ సూపర్ కార్!

Lamborghini Aventador Ultimae । భారత్‌కు దూసుకొచ్చిన లిమిటెడ్ ఎడిషన్ సూపర్ కార్!

07 July 2022, 17:34 IST

ఇటాలియన్ సూపర్ కార్ మేకర్ లాంబోర్ఘిని తమ లిమిటెడ్ ఎడిషన్ అవెంటడార్ LP 780-4 అల్టిమే కూపేను భారతదేశానికి పరిచయం చేసింది.

  • ఇటాలియన్ సూపర్ కార్ మేకర్ లాంబోర్ఘిని తమ లిమిటెడ్ ఎడిషన్ అవెంటడార్ LP 780-4 అల్టిమే కూపేను భారతదేశానికి పరిచయం చేసింది.
లాంబోర్ఘిని అవెంటడోర్ అల్టిమే కూపే లోపలి భాగంలో ప్రత్యేకమైన లేజర్ అల్కాంటారా ఫ్యాబ్రిక్ ను ఇచ్చారు. ఇది ఈ స్పెషల్ ఎడిషన్ కారుకు మాత్రమే పరిమితం..
(1 / 9)

లాంబోర్ఘిని ఈ లిమిటెడ్ Ultimae Coupé కార్లను ప్రపంచవ్యాప్తంగా కేవలం 350 యూనిట్లను మాత్రమే నిర్మిస్తుంది - ఇవన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయి.
(2 / 9)

ఈ మోడల్ పూర్తిగా పర్పుల్ యాక్సెంట్ షేడ్ అయినటువంటి Voila Pasifae కలర్ ఆప్షన్లో ఉంటుంది. 
(3 / 9)

లంబోర్ఘిని అవెంటడోర్ అల్టిమే అనేది ఇప్పటి వరకు వచ్చిన అన్ని మోడల్స్ కంటే అత్యంత శక్తివంతమైన అవెంటడోర్. Aventador Ultimae Coupé ఎక్స్టీరియర్ బాడీ అల్యూమినియం మిశ్రమం, మోనోకోక్ కార్బన్ ఫైబర్‌తో తయారైంది. ముందు, వెనుక ఫ్రేమ్‌లు అల్యూమినియం మిశ్రమంతో తయారయ్యాయి. ఫ్రంట్ బంపర్ లో ఫ్రంట్ స్ప్లిటర్ కాంటౌర్, మిర్రర్ హౌసింగ్, రాకర్ కవర్ అలాగే వెనుక బంపర్‌పై 360° లివరీని కలిగి ఉంది.
(4 / 9)

ఇండియా-స్పెక్ లంబోర్ఘిని అవెంటడోర్ అల్టిమే కూపే క్యాబిన్ భాగంలో 4-వీల్ స్టీరింగ్, TFT డిజిటల్ డాష్‌బోర్డ్‌తో వస్తుంది. పెద్దని డ్రైవర్ డిస్‌ప్లే, చిన్న ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, బకెట్ సీట్లు ఇతర కార్బన్ ఫైబర్ మెటీరియల్స్ ను కలిగి ఉంది.
(5 / 9)

ఈ కారులోని సీట్లు ప్రత్యేకమైన గ్రాఫిక్స్‌తో అల్కాంట్రా లేజర్‌ను కలిగి ఉంటుంది. ఇది చూడటానికి ఆహ్లాదకరంగా లగ్జరీ లుక్ తో కనిపిస్తుంది.
(6 / 9)

ఇందులో 6498cc సామర్థ్యం కల V12 పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. దీనిని 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. దీని శక్తివంతమైన ఇంజన్ 6750rpm వద్ద 720Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు.
(7 / 9)

ఈ ఆల్-వీల్-డ్రైవ్ సూపర్‌కార్ కేవలం 2.8 సెకన్లలోనే 100kmph వేగాన్ని అందుకోగలదు. అయితే సున్నా నుంచి 200kmph వేగాన్ని అందుకునేందుకు 8.7 సెకన్ల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 355 కిమీ.
(8 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి