తెలుగు న్యూస్  /  ఫోటో  /  Dengue Mosquitoes । డెంగ్యూ దోమ ఇలా ఉంటుంది, ఈ టైంలో కుడుతుంది, జాగ్రత్త!

Dengue Mosquitoes । డెంగ్యూ దోమ ఇలా ఉంటుంది, ఈ టైంలో కుడుతుంది, జాగ్రత్త!

03 November 2022, 17:10 IST

How to Identify Dengue Mosquitoes: డెంగ్యూ జ్వరం వ్యాప్తికి దోమలే ప్రధాన కారణం. అయితే దోమలన్నింటిలో ఈ డెంగ్యూ దోమ యమ డేంజర్, ఈ దోమ పేరు ఈడిస్ ఈజిప్టి. మరి దీనిని గుర్తించడం ఎలా, దీని సమయం ఎప్పుడు అనేది ఇక్కడ తెలుసుకోండి. దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి.

  • How to Identify Dengue Mosquitoes: డెంగ్యూ జ్వరం వ్యాప్తికి దోమలే ప్రధాన కారణం. అయితే దోమలన్నింటిలో ఈ డెంగ్యూ దోమ యమ డేంజర్, ఈ దోమ పేరు ఈడిస్ ఈజిప్టి. మరి దీనిని గుర్తించడం ఎలా, దీని సమయం ఎప్పుడు అనేది ఇక్కడ తెలుసుకోండి. దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి.
మళ్లీ డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ జ్వరం చాలా డేంజర్, ఈ జ్వరం వచ్చిందంటే ఏర్పడకుండానే శరీరంలోని తెల్ల రక్తకణాలను పూర్తిగా తగ్గించేసి మనిషి ప్రాణాలే తీస్తుంది. కాబట్టి భద్రంగా ఉండాలి.
(1 / 8)

  గత కొన్ని నెలలుగా, దేశవ్యాప్తంగా డెంగీ ఫీవర్ కారణంగా చాలా మంది మరణించారు. కాబట్టి జ్వరం బారినుంచి తప్పించుకోవాలంటే దీని గురించి అవగాహన కలిగి ఉండాలి.
(2 / 8)

ఈ డెంగ్యూ వ్యాప్తికి ఈడిస్ ఈజిప్టి అనే దోమ కారణంగా ఉంది. దీనిని ఎల్లో ఫీవర్ మస్కిటో అనే పేరుతోనూ పిలుస్తారు.
(3 / 8)

ఈ డెంగీ దోమలు ప్రధానంగా ఉదయం 7 నుండి 9 గంటల సయమం వరకు, అలాగే సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య ఎక్కువగా కుడతాయి. కాబట్టి ఈ సమయంలో కుట్టే దోమలపై జాగ్రత్తగా ఉండాలి.
(4 / 8)

ఈ దోమలు చీలమండలు, మోచేతుల దగ్గర ఎక్కువగా కుడతాయి. కాబట్టి ఇది కూడా గమనించాలి. అవసరమైతే, ఆ భాగాల్లో మీరు దోమల వికర్షక క్రీమ్ ఉపయోగించవచ్చు. దాంతో సమస్య తగ్గుతుంది.
(5 / 8)

నీరు నిల్వ ఉన్న చోట, తడి ప్రదేశాలలో  డెంగ్యూ దోమలు గుడ్లను పొదుగుతాయి. అవి 3 సంవత్సరాల వరకు జీవించగలవు. కాబట్టి మూలల్లో తడిగా లేకుండా చూసుకోండి.
(6 / 8)

 ఈ దోమలను గుర్తించడానికి సులభమైన మార్గం వాటి నలుపు రంగు. అలాగే కాళ్ళపై తెల్లటి మచ్చలు ఉంటాయి. ఈడిస్ ఈజిప్టిని గుర్తించడానికి ఇవి ప్రధాన మార్గాలు. ఈ దోమల పట్ల జాగ్రత్త వహించండి. అప్పుడే డెంగ్యూ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
(7 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి