తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tips For Skin: నిగనిగలాడే మెరిసే చర్మం కావాలా? ఇవి ట్రై చేయండి.. రిజల్ట్స్ పక్కా

Tips For Skin: నిగనిగలాడే మెరిసే చర్మం కావాలా? ఇవి ట్రై చేయండి.. రిజల్ట్స్ పక్కా

10 June 2022, 13:18 IST

పొడిబారడం లేదా వయస్సు కారణంగా చర్మం సహజమైన మెరుపును కోల్పోతుంది. పైగా యూవీ కిరణాల కారణంగా చర్మం నల్లబడుతుంది. కొల్లాజెన్ దెబ్బతింటుంది. టానింగ్‌ను వదిలించుకోవడానికి, చర్మ కాంతిని పునరుద్ధరించడానికి కొన్ని సింపుల్ హోం రెమెడీస్ సూచిస్తున్నారు నిపుణులు. మీరు ఫాలో అయిపోండి. 

  • పొడిబారడం లేదా వయస్సు కారణంగా చర్మం సహజమైన మెరుపును కోల్పోతుంది. పైగా యూవీ కిరణాల కారణంగా చర్మం నల్లబడుతుంది. కొల్లాజెన్ దెబ్బతింటుంది. టానింగ్‌ను వదిలించుకోవడానికి, చర్మ కాంతిని పునరుద్ధరించడానికి కొన్ని సింపుల్ హోం రెమెడీస్ సూచిస్తున్నారు నిపుణులు. మీరు ఫాలో అయిపోండి. 
మాన్​సూన్​ వచ్చినా.. ఎండమాత్రం తగ్గట్లేదు. ఈ క్రమంలో బయటకు వెళ్తే సన్​ ట్యాన్​కు గురవడం చాలా కామన్. అయితే టానింగ్ వల్ల చర్మం డల్​గా కనిపిస్తుంది. స్కిన్‌ ట్యానింగ్‌ను తగ్గించి మళ్లీ కాంతివంతం చేసుకోవడానికి ఖరీదైన ప్రొడెక్ట్స్ ఉపయోగించనవసరంలేదు. ఇంటి చిట్కాలతో వాటిని ఈజీగా వదిలించుకోవచ్చు అంటున్నారు చర్మవ్యాధి నిపుణులు.
(1 / 8)
మాన్​సూన్​ వచ్చినా.. ఎండమాత్రం తగ్గట్లేదు. ఈ క్రమంలో బయటకు వెళ్తే సన్​ ట్యాన్​కు గురవడం చాలా కామన్. అయితే టానింగ్ వల్ల చర్మం డల్​గా కనిపిస్తుంది. స్కిన్‌ ట్యానింగ్‌ను తగ్గించి మళ్లీ కాంతివంతం చేసుకోవడానికి ఖరీదైన ప్రొడెక్ట్స్ ఉపయోగించనవసరంలేదు. ఇంటి చిట్కాలతో వాటిని ఈజీగా వదిలించుకోవచ్చు అంటున్నారు చర్మవ్యాధి నిపుణులు.(Unsplash)
నిమ్మ, తేనె ప్యాక్: నిమ్మరసం తీసుకుని అందులో కొన్ని చుక్కల తేనె కలపండి. ఈ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. నిమ్మకాయ బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. తేనె చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.
(2 / 8)
నిమ్మ, తేనె ప్యాక్: నిమ్మరసం తీసుకుని అందులో కొన్ని చుక్కల తేనె కలపండి. ఈ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. నిమ్మకాయ బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. తేనె చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.(Unsplash, Instagram)
టొమాటో: ఇది స్కిన్ డి-టానింగ్ ఇంగ్రిడియంట్​ అని పరిశోధనల్లో కూడా తేలింది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. టొమాటో రసాన్ని కొద్దిగా తీసుకుని చర్మంపై టాన్ అయిన ప్రదేశంలో రాయండి. 15 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయండి.
(3 / 8)
టొమాటో: ఇది స్కిన్ డి-టానింగ్ ఇంగ్రిడియంట్​ అని పరిశోధనల్లో కూడా తేలింది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. టొమాటో రసాన్ని కొద్దిగా తీసుకుని చర్మంపై టాన్ అయిన ప్రదేశంలో రాయండి. 15 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేయండి.(Instagram)
శనగపిండి, పసుపు: చర్మం ఆకృతిని మెరుగుపరచడానికి, టాన్‌ను తొలగించడానికి ఇది బంగారు కలయిక. రెండు టీస్పూన్ల శెనగపిండిని తీసుకుని అందులో చిటికెడు పసుపు, కొన్ని చుక్కల నిమ్మరసం, పాలు కలపండి. దీన్ని చర్మంపై అప్లై చేసి ఆరనివ్వాలి. ఈ ప్యాక్ మీ చర్మాన్ని ప్రకాశవంతం చేయడమే కాకుండా.. యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుంది.
(4 / 8)
శనగపిండి, పసుపు: చర్మం ఆకృతిని మెరుగుపరచడానికి, టాన్‌ను తొలగించడానికి ఇది బంగారు కలయిక. రెండు టీస్పూన్ల శెనగపిండిని తీసుకుని అందులో చిటికెడు పసుపు, కొన్ని చుక్కల నిమ్మరసం, పాలు కలపండి. దీన్ని చర్మంపై అప్లై చేసి ఆరనివ్వాలి. ఈ ప్యాక్ మీ చర్మాన్ని ప్రకాశవంతం చేయడమే కాకుండా.. యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుంది.(Instagram)
కొబ్బరి పాలు: సాదా కొబ్బరి పాలలో విటమిన్ సి, తేలికపాటి ఆమ్లాలు ఉంటాయి, ఇవి డి-టానింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. తాజా కొబ్బరి పాలలో ఒక దూదిని ముంచి టాన్ అయిన ప్రదేశంలో రాయండి. కొబ్బరి పాలను చర్మం పీల్చుకుంటుంది. ఆరిన తర్వాత కడిగేయండి.
(5 / 8)
కొబ్బరి పాలు: సాదా కొబ్బరి పాలలో విటమిన్ సి, తేలికపాటి ఆమ్లాలు ఉంటాయి, ఇవి డి-టానింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. తాజా కొబ్బరి పాలలో ఒక దూదిని ముంచి టాన్ అయిన ప్రదేశంలో రాయండి. కొబ్బరి పాలను చర్మం పీల్చుకుంటుంది. ఆరిన తర్వాత కడిగేయండి.(Instagram/justdandyboutique)
తేనె బొప్పాయి ప్యాక్: బొప్పాయిలోని పపైన్ ఎంజైమ్ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. టాన్‌ను తొలగిస్తుంది. కొంచెం బొప్పాయిని మెత్తగా నూరి అందులో తేనె వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ముఖం, ఇతర టాన్డ్ స్కిన్ ప్రాంతాల్లో రాసి.. ఆరిన తర్వాత కడిగేయండి.
(6 / 8)
తేనె బొప్పాయి ప్యాక్: బొప్పాయిలోని పపైన్ ఎంజైమ్ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. టాన్‌ను తొలగిస్తుంది. కొంచెం బొప్పాయిని మెత్తగా నూరి అందులో తేనె వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ముఖం, ఇతర టాన్డ్ స్కిన్ ప్రాంతాల్లో రాసి.. ఆరిన తర్వాత కడిగేయండి.(Unsplash)
సన్‌స్క్రీన్ : ఈ రెమెడీస్ ఏమి లేకుండా.. ప్రతిరోజూ సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి. మధ్యాహ్నం ఎండలోకి వెళ్లకుండా ఉండండి. వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఇంటికి చేరుకున్న తర్వాత.. మీ చర్మాన్ని శుభ్రపరచడం, తేమ చేయడం మర్చిపోవద్దు.
(7 / 8)
సన్‌స్క్రీన్ : ఈ రెమెడీస్ ఏమి లేకుండా.. ప్రతిరోజూ సన్‌స్క్రీన్‌ని ఉపయోగించండి. మధ్యాహ్నం ఎండలోకి వెళ్లకుండా ఉండండి. వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఇంటికి చేరుకున్న తర్వాత.. మీ చర్మాన్ని శుభ్రపరచడం, తేమ చేయడం మర్చిపోవద్దు.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి