తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Hypertension | కోపం వద్దు.. కూల్ డౌన్! అధిక రక్తపోటును నివారించే ఆహారాలు ఇవే!!

Hypertension | కోపం వద్దు.. కూల్ డౌన్! అధిక రక్తపోటును నివారించే ఆహారాలు ఇవే!!

15 May 2022, 10:58 IST

హార్ట్ ఎటాక్, ఇతర గుండె జబ్బులు, కిడ్నీలు ఫెయిల్ అవడం, దృష్టి కోల్పోవడం ఇలా పెద్దపెద్ద అనారోగ్య సమస్యలన్నీ హైబీపీతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి రక్తపోటును అదుపులో ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. 

  • హార్ట్ ఎటాక్, ఇతర గుండె జబ్బులు, కిడ్నీలు ఫెయిల్ అవడం, దృష్టి కోల్పోవడం ఇలా పెద్దపెద్ద అనారోగ్య సమస్యలన్నీ హైబీపీతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి రక్తపోటును అదుపులో ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. 
రక్తపోటుకు అనేక కారణాలు ఉంటాయి. ఉప్పు ఎక్కువగా తినడం, అతిగా మద్యం సేవించడం, తినే ఆహారంలో పొటాషియం లేకపోవడం. అలాగే శరీరానికి తక్కువ పని కల్పిస్తూ మానసికంగా ఎక్కువ ఇత్తిడికి లోనయ్యే పరిస్థితులలో అది హైపర్ టెన్షన్‌కు దారితీస్తుంది. కాబట్టి హైబీపీ కలిగిన వారు BPని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం, సమయానికి మందులు తీసుకోవడం మాత్రమే కాకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. న్యూట్రిషన్ కన్సల్టెంట్ డాక్టర్ మైథాలీ వేసవి కాలంలో రక్తపోటును తగ్గించడంలో సహాయపడే ఆహారాల గురించి వివరించారు.
(1 / 9)
రక్తపోటుకు అనేక కారణాలు ఉంటాయి. ఉప్పు ఎక్కువగా తినడం, అతిగా మద్యం సేవించడం, తినే ఆహారంలో పొటాషియం లేకపోవడం. అలాగే శరీరానికి తక్కువ పని కల్పిస్తూ మానసికంగా ఎక్కువ ఇత్తిడికి లోనయ్యే పరిస్థితులలో అది హైపర్ టెన్షన్‌కు దారితీస్తుంది. కాబట్టి హైబీపీ కలిగిన వారు BPని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం, సమయానికి మందులు తీసుకోవడం మాత్రమే కాకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. న్యూట్రిషన్ కన్సల్టెంట్ డాక్టర్ మైథాలీ వేసవి కాలంలో రక్తపోటును తగ్గించడంలో సహాయపడే ఆహారాల గురించి వివరించారు.(Pixabay)
స్ట్రాబెర్రీలలో ఆంథోసైనిన్స్ (యాంటీ ఆక్సిడెంట్), విటమిన్ సి, పొటాషియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును అదుపు చేస్తాయి.
(2 / 9)
స్ట్రాబెర్రీలలో ఆంథోసైనిన్స్ (యాంటీ ఆక్సిడెంట్), విటమిన్ సి, పొటాషియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును అదుపు చేస్తాయి.(Pixabay)
అరటిపండ్లలో పొటాషియం, పీచు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అరటిపండ్లు తింటే బీపీ తగ్గుతుంది. ఇవి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. ఆకలిని నిలుపుకోవచ్చు.
(3 / 9)
అరటిపండ్లలో పొటాషియం, పీచు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అరటిపండ్లు తింటే బీపీ తగ్గుతుంది. ఇవి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. ఆకలిని నిలుపుకోవచ్చు.(Pixabay)
దానిమ్మపండ్లను తినడం ద్వారా శరీరంలో ఏసీఈ అనే ఎంజైమ్‌ ఉత్పత్తిని అదుపు చేస్తుంది. ఇది రక్తనాళాల పరిమాణాన్ని నియంత్రిస్తుంది. తద్వారా అధిక రక్తపోటును తగ్గించవచ్చు.
(4 / 9)
దానిమ్మపండ్లను తినడం ద్వారా శరీరంలో ఏసీఈ అనే ఎంజైమ్‌ ఉత్పత్తిని అదుపు చేస్తుంది. ఇది రక్తనాళాల పరిమాణాన్ని నియంత్రిస్తుంది. తద్వారా అధిక రక్తపోటును తగ్గించవచ్చు.(Pixabay)
మామిడి పండ్లలో ఫైబర్, బీటా కెరోటిన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ వేసవి సీజన్లో మామిడి పండ్లను షేక్స్, స్మూతీస్, డెజర్ట్‌ ఎలాగైనా తీసుకోవచ్చు.
(5 / 9)
మామిడి పండ్లలో ఫైబర్, బీటా కెరోటిన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ వేసవి సీజన్లో మామిడి పండ్లను షేక్స్, స్మూతీస్, డెజర్ట్‌ ఎలాగైనా తీసుకోవచ్చు.(Pixabay)
పాలకూర, బీట్ రూట్, వెల్లుల్లి వంటి పదార్థాలు నైట్రేట్‌లను కలిగి ఉంటాయి. వీటిని తింటే అవి జీర్ణమైన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్‌ విడుదల అవుతుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది.
(6 / 9)
పాలకూర, బీట్ రూట్, వెల్లుల్లి వంటి పదార్థాలు నైట్రేట్‌లను కలిగి ఉంటాయి. వీటిని తింటే అవి జీర్ణమైన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్‌ విడుదల అవుతుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది.(Pixabay)
పెరుగులో పొటాషియం, కాల్షియంలు ఉంటాయి, ఇవి రక్తపోటును అదుపుచేస్తాయి. ఇందులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది, ఇది ఒత్తిడి, వాపుల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. వేసవిలో పెరుగును మజ్జిగ, స్మూతీస్, లస్సీ , రైతాస్‌గా తీసుకోండి.
(7 / 9)
పెరుగులో పొటాషియం, కాల్షియంలు ఉంటాయి, ఇవి రక్తపోటును అదుపుచేస్తాయి. ఇందులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది, ఇది ఒత్తిడి, వాపుల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. వేసవిలో పెరుగును మజ్జిగ, స్మూతీస్, లస్సీ , రైతాస్‌గా తీసుకోండి.(Pixabay)
కొబ్బరి నీరు మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది, సహజమైన మూత్రవిసర్జనలా పనిచేస్తుంది. ఇది ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను పూరించడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
(8 / 9)
కొబ్బరి నీరు మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది, సహజమైన మూత్రవిసర్జనలా పనిచేస్తుంది. ఇది ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్‌ను పూరించడం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.(Pixabay)

    ఆర్టికల్ షేర్ చేయండి