తెలుగు న్యూస్ / ఫోటో /
Healthy Heart | గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే.. నోటిని శుభ్రంగా ఉంచుకోండి..
నోటిలో పేరుకుపోయే బ్యాక్టీరియా.. వివిధ గుండె జబ్బులకు ప్రధాన కారణాలలో ఒకటి. వినడానికి ఆశ్చర్యంగా ఉందా? అయితే ఇది నిజం. అందువల్ల, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవాలనుకుంటే.. మీ దంతాలను జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు మీకు సలహా ఇస్తున్నారు.
నోటిలో పేరుకుపోయే బ్యాక్టీరియా.. వివిధ గుండె జబ్బులకు ప్రధాన కారణాలలో ఒకటి. వినడానికి ఆశ్చర్యంగా ఉందా? అయితే ఇది నిజం. అందువల్ల, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవాలనుకుంటే.. మీ దంతాలను జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు మీకు సలహా ఇస్తున్నారు.
(1 / 8)
యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీలో గుండె జబ్బులపై ఒక కథనం ఇటీవల ప్రచురించారు. దంతాలు, చిగుళ్లలో వివిధ రకాల బ్యాక్టీరియా చేరడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ఆ కథనం పేర్కొంది. ఈ బ్యాక్టీరియా పూర్తి గుండె వైఫల్యానికి కూడా కారణమవుతుంది. ఈ సమస్యను నివారించడానికి ఏమి చేయాలి? ఆ పద్ధతులు ఏమిటో చూద్దాం.(Photo by Diana Polekhina on Unsplash)
(2 / 8)
రోజుకు రెండుసార్లు కనీసం రెండు నిమిషాల పాటు మృదువైన బ్రష్‌తో మీ దంతాలను బ్రష్ చేయండి. ప్రతి రెండు నెలలకు బ్రష్ మార్చండి. ఇది దంతాలు, చిగుళ్లలో బ్యాక్టీరియా చేరడం తగ్గిస్తుంది.(Pixabay)
(3 / 8)
కేవలం పళ్ళు తోముకోవడంతో నోరు శుభ్రం అయినట్లు కాదు. తర్వాత మౌత్‌వాష్‌తో బాగా కడగాలి. దానిలో పేరుకుపోయిన ఆహార కణాలు దంతాల పగుళ్ల నుంచి శుభ్రం అవుతాయి.(Photo by Towfiqu barbhuiya on Unsplash)
(4 / 8)
ఆరోగ్యకరమైన ఆహారం తినండి. వీలైనంత వరకు చక్కెర లేదా అదనపు తీపి ఆహారాలకు దూరంగా ఉండండి.(Pixabay)
(6 / 8)
క్రమం తప్పకుండా డాక్టర్ వద్దకు వెళ్లండి. మీ దంతాలను తనిఖీ చేయించండి. ఎక్కడైనా సమస్య ఉంటే చికిత్స చేయించుకోవాలి.(Photo by Quang Tri NGUYEN on Unsplash)
(7 / 8)
గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి ముఖం, దంతాలు, చిగుళ్లను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. నోటి లోపలి భాగాన్ని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల గుండెపోటు ప్రమాదం చాలా వరకు తగ్గిస్తుంది.(Pixabay)
ఇతర గ్యాలరీలు