Heart | హృదయాన్ని పదిలంగా ఉంచుకునేందుకు.. ఏడు పానీయాలు-seven drinks to everyone for healthy heart ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Heart | హృదయాన్ని పదిలంగా ఉంచుకునేందుకు.. ఏడు పానీయాలు

Heart | హృదయాన్ని పదిలంగా ఉంచుకునేందుకు.. ఏడు పానీయాలు

Vijaya Madhuri HT Telugu
Mar 02, 2022 05:50 PM IST

గుండె. మానవ శరీరభాగాలలో అన్ని భాగాలు ముఖ్యమే అయినా.. గుండెకు మాత్రం ప్రత్యేక స్థానముంటుంది. అలాంటి గుండె కొన్ని సమయాల్లో చాలా నీరసపడిపోతుంది. దానిని చురుకుగా ఉంచేందుకు.. శక్తివంతంగా.. ఆరోగ్యవంతంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఈ పానీయాలు మీకు కచ్చితంగా ఉపయోగపడతాయి.

హృదయానికి పానియాలు
హృదయానికి పానియాలు

Healthy Heart | ఈ ఏడు హృదయ-ఆరోగ్యకరమైన పానీయాలు మీ హృదయానికి చాలా మంచి చేస్తాయి. ఈ పానీయాలు మీ హృదయానికి అమృతంగా పనిచేసి.. గుండెను చురుకుగా.. ఆరోగ్యవంతంగా మారుస్తాయి.

కాఫీ

కాఫీ

కాఫీ

చాలా ప్రయోజనకరమైన పానీయాలలో.. కాఫీ ఒకటి. మితంగా తీసుకుంటే ఏదైనా మంచిదే. కొందరు రోజుకు 5 నుంచి 6 కప్పుల వరకు కాఫీని గటగటా తాగేస్తారు. అలా తాగితే ఏదైనా ప్రమాదమే. కానీ రోజుకు రెండు కప్పుల కాఫీని.. చక్కెర, పాలు లేకుండా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా గుండెకు ఇది చాలా మంచి చేస్తుంది. ఎందుకంటే కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను బాగు చేయడంలో సహాయం చేస్తాయి. ఒకవేళ మీరు హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నట్లయితే.. కాఫీని మానేయడమే ఉత్తమం.

గ్రీన్ జ్యూస్

గ్రీన్ జ్యూస్

గ్రీన్ జ్యూస్

ఆకుపచ్చ రంగులో ఉన్న ఏదైనా ఆకుకూరను తీసుకుని, బ్లెండర్‌లో వేస్తే గ్రీన్ జ్యూస్ సిద్ధమవుతుంది. ఈ పానీయంలో ఫైబర్, ఐరన్, కాల్షియం కచ్చితంగా ఎక్కువగా ఉంటాయి. ఈ పోషకాలున్నీ.. మీ శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవన్నీ మీ గుండెను ఎప్పటికీ యవ్వనంగా ఉంచుతాయి.

ఏబీసీ జ్యూస్

ఏబీసీ జ్యూస్

ఏబీసీ జ్యూస్

ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్ జ్యూస్ గుండెకు చేసే మేలు అంతా ఇంతా కాదు. పైన పేర్కొన్న పానీయాల అభిమాని మీరు కాకపోతే.. మీరు దీనిని కచ్చితంగా ఇష్టపడతారు. ఎందుకంటే ఇది రుచి కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కాకుండా.. మీ గుండెకు రోజువారీ అవసరాలైన ఐరన్, ఫోలేట్‌లు, పొటాషియంలను కలిగి ఉంటుంది.

మందార టీ

మందార టీ

మందార టీ

ఇది ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ.. మందార టీ మీ హృదయానికి మేజిక్ ట్రిక్ చేయగలదు. ఈ మందార టీ రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. రక్తపోటును కూడా ఇది తగ్గిస్తుంది. కాబట్టి ప్రాథమికంగా, ఇది మీ హృదయానికి కూడా సరిగ్గా సరిపోతుంది.

మచా టీ

మచా టీ

మచా టీ

బరువు తగ్గడానికి మచా టీ గొప్పదని మీకు తెలుసు. ఎందుకంటే ఇది మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గితే, అది స్వయంచాలకంగా గుండెపై సానుకూల ప్రభావం చూపుతుంది. అధ్యయనాల ప్రకారం, ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్ (EGCG)తో కూడిన మాచా టీని మీరు మీ గుండె కోసం తీసుకోవాల్సి ఉంటుంది.

బొప్పాయి రసం

బొప్పాయి రసం

బొప్పాయి రసం

లైకోపీన్ గురించి విన్నారా? బొప్పాయి పూర్తిగా దీనితోనే నిండి ఉంటుంది. మీ హృదయానికి ఇది చాలా అవసరం. లైకోపీన్ రక్త ప్రసరణను మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉంది. రోజూ బొప్పాయి రసం తాగడం వల్ల గుండె సంబంధిత మరణాలను పెద్ద మొత్తంలో తగ్గించడంలో సహాయపడుతుందని వైద్య నిపుణలు తెలిపారు.

దానిమ్మ రసం

దానిమ్మ రసం

దానిమ్మ రసం

పాలీఫెనాల్స్, ఇతర సూక్ష్మపోషకాలు కాకుండా, దానిమ్మపండులో ప్రత్యేకమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి ధమనులలోని అడ్డంకులను తగ్గిస్తాయి. ధమనులను మృదువుగా ఉంచడంలో, రక్త ప్రవాహాన్ని అదుపులో ఉంచడంలో కూడా ఇవి సహాయపడతాయి.

WhatsApp channel