తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pre-workout Foods । జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌లు చేసే గంట ముందు ఈ ఆహారాలు తినండి!

Pre-Workout Foods । జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌లు చేసే గంట ముందు ఈ ఆహారాలు తినండి!

13 July 2022, 22:36 IST

మీరు జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌లు చేసేటపుడు మధ్యలోనే శక్తిహీనంగా ఫీలవుతున్నారా? అంటే మీ శరీరంలో ఇంధనం అయిపోయిందని అర్థం. అదనంగా శక్తి పొందాలంటే వర్కౌట్స్ చేసే ముందు ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవాలి. అవేంటో ఇక్కడ చూడండి.

  • మీరు జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌లు చేసేటపుడు మధ్యలోనే శక్తిహీనంగా ఫీలవుతున్నారా? అంటే మీ శరీరంలో ఇంధనం అయిపోయిందని అర్థం. అదనంగా శక్తి పొందాలంటే వర్కౌట్స్ చేసే ముందు ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవాలి. అవేంటో ఇక్కడ చూడండి.
జిమ్‌కి వెళ్లడం అంటే కేవలం కేలరీలను బర్న్ చేయడం మాత్రమే కాదు, మీ శరీరాన్ని శక్తివంతంగా దృఢంగా మార్చడం కూడా. ఇందుకోసం మీరు వ్యాయామాలు చేసే కంటే ముందే సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. అపుడే మీరు సజావుగా ఎక్సర్‌సైజ్‌లు చేయగలుగుతారు. వీటిని కనీసం 1 గంట ముందు తీసుకోవాలి.
(1 / 7)
జిమ్‌కి వెళ్లడం అంటే కేవలం కేలరీలను బర్న్ చేయడం మాత్రమే కాదు, మీ శరీరాన్ని శక్తివంతంగా దృఢంగా మార్చడం కూడా. ఇందుకోసం మీరు వ్యాయామాలు చేసే కంటే ముందే సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. అపుడే మీరు సజావుగా ఎక్సర్‌సైజ్‌లు చేయగలుగుతారు. వీటిని కనీసం 1 గంట ముందు తీసుకోవాలి.(Unsplash)
వర్కవుట్ కోసం డ్రై ఫ్రూట్స్ బెస్ట్ ఆప్షన్. అవి సులభంగా జీర్ణమవుతాయి. మంచి కార్బో హైడ్రేట్స్ కలిగి ఉంటాయి.
(2 / 7)
వర్కవుట్ కోసం డ్రై ఫ్రూట్స్ బెస్ట్ ఆప్షన్. అవి సులభంగా జీర్ణమవుతాయి. మంచి కార్బో హైడ్రేట్స్ కలిగి ఉంటాయి.(Unsplash)
ఓట్ మీల్ కూడా మంచి శక్తివంతమైన ఆహారం. ఓట్స్ ఫైబర్, కార్బోహైడ్రేట్లతో నిండి ఉంటాయి. కండరాలు చురుకుగా పని చేయడానికి ఈ అల్పాహారం మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. కాబట్టి మీ వ్యాయామానికి ముందు దీన్ని తీసుకోవడం వల్ల మంచి శక్తి లభిస్తుంది.
(3 / 7)
ఓట్ మీల్ కూడా మంచి శక్తివంతమైన ఆహారం. ఓట్స్ ఫైబర్, కార్బోహైడ్రేట్లతో నిండి ఉంటాయి. కండరాలు చురుకుగా పని చేయడానికి ఈ అల్పాహారం మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. కాబట్టి మీ వ్యాయామానికి ముందు దీన్ని తీసుకోవడం వల్ల మంచి శక్తి లభిస్తుంది.(Unsplash)
సబ్జా గింజలు మీ ఎనర్జీ లెవల్స్‌ను బాగా పెంచుతాయి. వర్కవుట్‌కు ముందు తీసుకునే ఉత్తమమైన ఆహారాలలో ఇది కూడా ఒకటి. వీటిలో ప్రోటీన్, మెగ్నీషియం ఉంటాయి, ఇవి రెండూ గొప్ప శక్తి వనరులు.
(4 / 7)
సబ్జా గింజలు మీ ఎనర్జీ లెవల్స్‌ను బాగా పెంచుతాయి. వర్కవుట్‌కు ముందు తీసుకునే ఉత్తమమైన ఆహారాలలో ఇది కూడా ఒకటి. వీటిలో ప్రోటీన్, మెగ్నీషియం ఉంటాయి, ఇవి రెండూ గొప్ప శక్తి వనరులు.(Unsplash)
ఉడికించిన గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని వ్యాయామానికి ముందు తీసుకోవడం వల్ల అలసిపోయే కండరాలకు తక్షణ ఇంధనం లభిస్తుంది.
(5 / 7)
ఉడికించిన గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని వ్యాయామానికి ముందు తీసుకోవడం వల్ల అలసిపోయే కండరాలకు తక్షణ ఇంధనం లభిస్తుంది.(Unsplash)
అరటిపండ్లు కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి. పొటాషియం సమృద్ధిగా ఉన్నందున నొప్పిని నివారించడంలో సహాయపడతాయి.
(6 / 7)
అరటిపండ్లు కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి. పొటాషియం సమృద్ధిగా ఉన్నందున నొప్పిని నివారించడంలో సహాయపడతాయి.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి