Energetic GYM Session | జిమ్​లో ఎక్కువ సేపు కష్టపడాలంటే.. ముందు ఇవి తినాల్సిందే-pre workout healthy foods for energetic gym session ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Pre Workout Healthy Foods For Energetic Gym Session

Energetic GYM Session | జిమ్​లో ఎక్కువ సేపు కష్టపడాలంటే.. ముందు ఇవి తినాల్సిందే

HT Telugu Desk HT Telugu
Apr 09, 2022 08:12 AM IST

వ్యాయామం చేయడమనేది చాలా మంచి విషయం. బరువు తగ్గాలన్న హడావుడిలో చాలామంది ఖాళీ కడుపుతో జిమ్​లకు వెళ్లిపోతారు. అక్కడ కుస్తీలు చేస్తూ చక్కెర వచ్చి పడిపోతారు. అలా కాకుండా తక్కువ కొవ్వు, మితమైన ప్రోటీన్, కార్బోహైడ్రెట్లు అధికంగా ఉండే చిరుతిళ్లను తీసుకుని వ్యాయామాలు చేయవచ్చు అంటున్నారు నిపుణులు. ఇవి మీకు కావాల్సిన శక్తిని అందించి.. ఎక్కువ సేపు వ్యాయామం చేసేలా ప్రోత్సాహిస్తాయంటున్నారు. మరి ఆ చిరుతిళ్లు ఏంటో తెలుసుకుందామా?

జిమ్ వర్క్అవుట్స్
జిమ్ వర్క్అవుట్స్

Pre Workout Foods | మీరు వ్యాయామానికి ముందు తినే హెల్తీ చిరుతిండి.. మీరు ఎంతసేపు వర్క్​అవుట్స్ చేయాలో నిర్ణయిస్తుంది అంటే మీరు నమ్ముతారా? కొంతమంది ఫాస్ట్ కార్డియో వ్యాయామాన్ని ఇష్టపడతారు. కేలరీ వ్యయాన్ని పెంచడానికి.. వారు ఖాళీ కడుపుతో జిమ్​కు వెళ్లడం, పరుగెత్తడం, ఈత కొట్టడం, సైకిల్‌ వంటివి చేస్తారు. మరికొందరు వ్యాయామం చేసే ముందు ఏదైనా తినడం తప్పనిసరి అని నమ్ముతారు. తక్కువ కొవ్వు, మితమైన ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే వాటిని వ్యాయామానికి ముందు తీసుకుంటారు. ఈ రకమైన ఆహారం మీకు శక్తిని ఇస్తుంది. వ్యాయామ సమయంలో మీ కండరాలు విచ్ఛిన్నం కాకుండా కాపాడుతుంది.

ఓట్​మీల్

వ్యాయామానికి ముందు ఓట్​మీల్​ తీసుకోవడమనేది ఒక అద్భుతమైన ఎంపిక. ఓట్​మీల్ శక్తిని అందించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. మీరు మీ ఓట్స్‌లో పండ్లను కలిపి తీసుకుంటే ఇంకా మంచిది.

ప్రోటీన్ షేక్

ప్రోటీన్ షేక్స్ (నీటిలో లేదా తక్కువ కొవ్వు పాలలో) ఉదయం వ్యాయామానికి ముందు తీసుకుంటే.. కండరాల ప్రోటీన్ సంశ్లేషణను మెరుగుపడుతుంది.

అరటిపండ్లు

అరటిపండ్లలో.. యాపిల్స్, నారింజ వంటి ఇతర పండ్ల కంటే రెండు రెట్లు ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి సుదీర్ఘ వ్యాయామం చేసేందుకు ఓపికనిస్తాయి. పీనట్​ బటర్​తో కలిపి సగం అరటిపండు వ్యాయామానికి ముందు తీసుకుంటే.. ప్రోటీన్, మంచి కొవ్వును పొందవచ్చు. ఇది మీ వ్యాయామం సమయంలో మీ రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. లేదంటే అరటిపండు ముక్కలను తక్కువ కొవ్వు ఉన్న పాలల్లో కలిపి తీసుకోవచ్చు.

పెరుగు

మీ జిమ్​ లేదా వ్యాయామాలకు వెళ్లే అరగంట ముందు తియ్యని పెరుగును స్నాక్​గా తీసుకోవచ్చు. పండ్లు కూడా మంచి చిరుతిండే కావొచ్చు. కానీ పెరుగు కూడా చాలా మంచిది. దీనిలో కార్బోహైడ్రేట్లు, ద్రవపదార్థాలు, పోషకాలు ఉంటాయి. కాబట్టి వ్యాయామాలు చేసే ముందు దీనిని బేషుగ్గా తీసుకోవచ్చు. పైగా సమ్మర్​లో పెరుగు తీసుకోవడం మరీ మంచిది.

కాఫీ

కెఫీన్ అనేది శక్తి స్థాయిలను పెంచుతుంది. అందుకే వ్యాయామానికి ముందు ఒక కప్పు స్ట్రాంగ్​ కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్ తీసుకుంటే.. అది మీకు ఎక్కువ శక్తిని, ప్రోత్సాహాన్ని అందిస్తుంది. రోజూ వ్యాయామం చేసే వారికి.. వర్కవుట్‌లపై కెఫీన్ మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. కెఫిన్ వినియోగంతో వచ్చే చికాకును తప్పించుకోవడానికి.. కొన్ని పండ్లు, బాదం లేదా టోస్ట్‌తో జత చేయండి. కెఫిన్ ఎక్కువ వినియోగిస్తే మంచిది కాదని అందరికీ తెలుసు కానీ.. దాని పరిమితంగా తీసుకుంటే లాభాలు కూడా ఉంటాయనే విషయం గ్రహించాలి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్