తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Zomato | నెల ముందు రూ. 135.. ఇప్పుడు రూ. 82.. ఈ షేరు ఇప్పుడు కొంటే భారీ లాభాలే?

Zomato | నెల ముందు రూ. 135.. ఇప్పుడు రూ. 82.. ఈ షేరు ఇప్పుడు కొంటే భారీ లాభాలే?

Sharath Chitturi HT Telugu

21 March 2022, 13:51 IST

google News
    • Zomato share news | కొన్ని రోజులుగా జొమాటో షేర్​​విలువ భారీగా పతనమవుతోంది. నెల ముందు సుమారు రూ. 130గా ఉన్న ఒక్క షేరు ధర ఇప్పుడు రూ. 82కు వచ్చింది. మరి ఈ కంపెనీ షేరు ఇక్కడ కొనుగోలు చేయవచ్చా? నిపుణుల మాటేంటంటే..
జొమాటో
జొమాటో (REUTERS)

జొమాటో

Zomato share price | 2021 జులైలో జొమాటో ఐపీఓ బంపర్​ లిస్టింగ్​.. వార్తల్లో నిలిచింది. ఇష్యూ ధర రూ. 76గా ఉంటే.. రూ. 126 దగ్గర లిస్ట్​ అయ్యింది. ఆ తర్వాత ఒకానొక దశలో రూ. 154 వరకు కూడా వెళ్లింది. కానీ ఇటీవలి కాలంలో జొమాటో షేర్లు భారీగా పతనమయ్యాయి. నెల ముందు రూ. 135గా ఉన్న ఒక్క షేరు విలువ.. ఇప్పుడు మంగళవారం మార్కెట్​ ముగిసే సమయానికి రూ. 82.50గా ఉంది. ఒకానొక దశలో.. మంగళవారం.. ఇష్యూ ధర కన్నా కిందకు పడి(రూ. 75).. ఆ తర్వాత కొంత పుంజుకుంది.

కారణమేంటి?

గత వారం క్యూ3 ఫలితాలను జొమాటో విడుదల చేసింది. రెస్టారెంట్​ ఫుడ్​పై డిమాండ్​ పెరగడంతో రెవెన్యూ పెరిగింది. ఫలితంగా కంపెనీ అప్పులు మరింత తగ్గాయి.

అయితే అంతర్జాతీయంగా న్యూ ఏజ్​ టెక్​ సంస్థల షేర్లు.. కొన్ని రోజులుగా తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఫేస్​బుక్​ గణాంకాలతో ఈ అమ్మకాలు మొదలయ్యాయి. దేశీయ మార్కెట్లలో ఉన్న జొమాటో, నైకాతో పాటు ఇతర కంపెనీల షేర్లు సైతం డీలాపడ్డాయి.

ఇక్కడ కొనుగోలు చేయవచ్చా?

"జొమాటే షేర్లు మరింత పడే అవకాశముంది. రూ. 65- రూ. 70 వరకు వెళ్లే అవకాశం ఉంది. దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్న వారు ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. 2-3ఏళ్ల పాటు షేర్లు ఉంచుకునే ఆలోచన ఉంటే రూ. 65- రూ. 70 మధ్య కొనుగోళ్లు చేయడం మంచిది. ఒక్కసారి రూ. 100 దాటితే షేర్​ ధర భారీగా పెరిగే అవకాశముంది," అని జీసీఎల్​ సెక్యూరిటీస్​ వైస్​ ఛైర్మన్​ రవి సింఘల్​ వెల్లడించారు.

హెచ్చరిక: ఇది పూర్తిగా నిపుణుల అభిప్రాయం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగు కేవలం కథనం ప్రచురించింది. మీ ఫైనాన్షియల్​ ఎడ్వైజర్​ను సంప్రదించిన తర్వాతే ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవాల్సి ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం