తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Stock Markets | ఒడుదొడుకుల్లో దేశీయ సూచీలు..

Stock markets | ఒడుదొడుకుల్లో దేశీయ సూచీలు..

HT Telugu Desk HT Telugu

21 March 2022, 13:46 IST

google News
    • Stock market news | సెన్సెక్స్​, నిఫ్టీలు సోమవారం ఒడుదొడుకుల్లో ట్రేడ్​ అవుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ పరిస్థితులు ఇందుకు కారణం!
బీఎస్​ఈ సెన్సెక్స్​
బీఎస్​ఈ సెన్సెక్స్​ (REUTERS)

బీఎస్​ఈ సెన్సెక్స్​

Stock market live updates | అంతర్జాతీయంగా నెలకొన్న మిశ్రమ పవనాల మధ్య దేశీయ సూచీలు సోమవారం ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​, ఎన్​ఎస్​ఈ నిఫ్టీలు రెండు లాభాల్లో ప్రారంభమైనా.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి.

సెన్సెక్స్​ 58,030 వద్ద ప్రారభమై.. ప్రస్తుతం 48 పాయింట్ల నష్టంతో 57,816 వద్ద ట్రేడ్​ అవుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 17,329 వద్ద ప్రారంభమై.. ప్రస్తుతం 17,272 వద్ద కొనసాగుతోంది.

లాభాలు.. నష్టాలు..

విప్రో, ఇన్ఫోసిస్​, మారుతి, టెక్​ఎం, టాటా స్టీల్​, టైటాన్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఏషియన్​ పెయింట్స్​, పవర్​గ్రిడ్​, కొటాక్​ బ్యాంక్​, హెచ్​యూఎల్​ షేర్లు నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం