DMK vs Governor : ‘గవర్నర్‌ను చంపడానికి ఉగ్రవాదిని పంపిస్తా..’
14 January 2023, 8:56 IST
- DMK vs Governor : డీఎంకే ప్రతినిధి శివాజీ కృష్ణమూర్తి.. గవర్నర్ రవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘గవర్నర్‌ను చంపేందుకు ఉగ్రవాదిని పంపిస్తా’ అని వ్యాఖ్యానించారు.
గవర్నర్‌పై డీఎంకే ప్రతినిధి వివాదాస్పద వ్యాఖ్యలు..
DMK vs Governor : తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి- డీఎంకే మధ్య వివాదం మరింత ముదిరింది! గవర్నర్‌పై అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు డీఎంకే ప్రతినిధి శివాజీ కృష్ణమూర్తి. 'తమిళనాడు గవర్నర్‌ను హత్య చేసేందుకు ఉగ్రవాదిని పంపిస్తా,' అని అన్నారు.
‘కశ్మీర్‌కు వెళ్లిపోవాలి..’
తమిళనాడులో ఇటీవలే ఓ సమావేశం జరిగింది. అందులో పాల్గొన్న శివాజీ కృష్ణమూర్తి.. గవర్నర్‌కు వ్యతిరేకంగా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంబేడ్కర్ పేరు ఎత్తడం ఇష్టం లేకపోతే.. కశ్మీర్‌కు వెళ్లిపోవాలని వ్యాఖ్యానించారు.
Tamil Nadu Governor RN Ravi latest news : "గవర్నర్‌ను తిట్టొద్దని సీఎం చెబుతున్నారు. అసెంబ్లీలో సరిగ్గా ప్రసంగం చేసి ఉంటే.. నేను గవర్నర్ కాళ్ల వద్ద పువ్వులు వేసేవాడిని. చేతులు జోడించి దండం పెట్టేవాడిని. కానీ ఆయన అలా చేయలేదు. అంబేడ్కర్ పేరును చెప్పేందుకు ఇష్టపడలేదు. అలాంటి వ్యక్తిని చెప్పుతో కొట్టే హక్కు నాకు లేదా? అంబేడ్కర్ పేరును ప్రస్తావించడం ఇష్టం లేకపోతే.. కశ్మీర్‌కు వెళ్లిపోండి. గవర్నర్‌ను కాల్చి చంపేందుకు అక్కడికి ఉగ్రవాదిని పంపిస్తా," అని మండిపడ్డారు శివాజీ కృష్ణమూర్తి.
తీవ్రస్థాయిలో వ్యతిరేకించిన బీజేపీ..
గవర్నర్ ఆర్ఎన్ రవిపై డీఎంకే ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ఖండించారు. డీఎంకేకు ఉగ్రవాదులతో లింక్ ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు.
Tamil Nadu CM MK Stalin : "గవ్నరర్ను కశ్మీర్‌కు పంపిస్తానని, అక్కడికి ఉగ్రవాదులను పంపించి హత్య చేయిస్తానని డీఎంకే ప్రతినిధి అంటున్నారు. డీఎంకేకు ఉగ్రవాదులతో లింక్ ఉందా? అని పోలీసులు దర్యాప్తు చేపట్టాలి. చాలా నిచమైన పదజాలంతో గవర్నర్‌ను వ్యాఖ్యలు చేశారు శివాజీ కృష్ణమూర్తి. ఇవన్నీ.. సీఎం ఎంకే స్టాలిన్ ఆశిస్సులతోనే జరుగుతున్నట్టు అనిపిస్తోంది," అని బీజేపీ నేత నారాయణ్ తిరుపతి మండిపడ్డారు.
డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తితో పాటు మరో నాయకుడు ఆర్ఎస్ భారతీని.. గూండా చట్టం కింద అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు నారాయణ్ తిరుపతి.
"తమిళనాడు పోలీసులకు ధైర్యం ఉంటే.. డీఎంకే నేతలను అరెస్ట్ చేయాలి. గూండా చట్టం కింద వారిద్దరిని ఏడాది పాటు జైలులో పెట్టాలి," అని డిమాండ్ చేశారు బీజేపీ నేత.
ఇదీ వివాదం..
MK Stalin vs RN Ravi : ఈ నెల 9న.. అసెంబ్లీలో తమిళనాడు గవర్నర్ చేసిన ప్రసంగం వార్తలకెక్కింది. ప్రసంగంలో కొంత భాగాన్ని పక్కనపెట్టినట్టు, పేపర్లలో లేనివి కూడా ప్రస్తావించినట్టు డీఎంకే ఆరోపించింది. ఆయనకు వ్యతిరేకంగా సీఎం స్టాలిన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ పరిణామాల మధ్య ఆర్ఎన్ రవి.. సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత డీఎంకే- బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది.