తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  'Madras Eye' Cases Rise In Tamil Nadu:తమిళనాడును వణికిస్తున్న ‘మద్రాస్ ఐ’ కేసులు

'Madras Eye' cases rise in Tamil Nadu:తమిళనాడును వణికిస్తున్న ‘మద్రాస్ ఐ’ కేసులు

HT Telugu Desk HT Telugu

22 November 2022, 20:05 IST

google News
  • 'Madras Eye' infection: తమిళనాడులో ‘మద్రాస్ ఐ’ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆందోళనకర స్థాయిలో ఈ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

‘మద్రాస్ ఐ’ సోకి న కన్ను
‘మద్రాస్ ఐ’ సోకి న కన్ను

‘మద్రాస్ ఐ’ సోకి న కన్ను

'Madras Eye' infection: సాధారణంగా వర్షకాలంలో ఈ ‘మద్రాస్ ఐ’ ఇన్ఫెక్షన్ సమస్య ప్రారంభమవుతుంది. కానీ, కొద్దిమందిలో మాత్రమే ఈ సమస్య కొన్ని రోజుల పాటు ఇబ్బంది పెట్టి తగ్గిపోతుంది. కానీ, ఈ సంవత్సరం ‘మద్రాస్ ఐ’ ఇన్ఫెక్షన్లు తమిళనాడులో ప్రమాదకర స్థాయిలో నమోదవుతున్నాయి.

What is 'Madras Eye' infection: ఏంటీ మద్రాస్ ఐ?

ఇది కళ్లకు వచ్చే ఇన్ ఫెక్షన్. దీన్నే కంజక్టివైటిస్ (conjunctivitis) అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ‘కళ్ల కలక’, ‘కళ్లు రావడం’ అని కూడా అంటారు. ఎడెనోవైరస్(adenovirus) కారణంగా ప్రధానంగా ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. 90% conjunctivitis ఈ వైరస్ కారణంగానే వస్తుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ సమస్య తమిళనాడును భారీగా ఇబ్బంది పెడ్తోంది. ఈ conjunctivitis ఇన్ఫెక్షన్ ఇతరులకు చాలా తొందరగా సోకుతుంది. కంటి నుంచి వచ్చిన స్రావాల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది.

'Madras Eye' infection: రోజుకు 4500 కేసులు

తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు దాదాపు 4000 నుంచి 4500 conjunctivitis కేసులు నమోదవుతున్నాయి. దాంతో, ఈ ఇన్ఫెక్షన్ సోకిన వారు వెంటనే ఒంటరిగా ఉండాలని, వేరే వారితో కలవవద్దని, తద్వారా ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టవచ్చని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సూచించింది. ఈ ఇన్ఫెక్షన్ ఇప్పటివరకు 1.5 లక్షల మందికి conjunctivitis సోకిందని వెల్లడించింది. చెన్నైలోని కంటి ఆసుపత్రులకు రోజూ వందకు పైగా పేషెంట్ల చొప్పున వస్తున్నారు.చెన్నైతో పాటు సేలం, ధర్మపురి జిల్లాల్లో ఈ conjunctivitis ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది. చెన్నైలోని అగర్వాల్ ఆసుపత్రికి రోజూ 500 మంది పేషెంట్లు వస్తున్నారని ఆ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Reasons for 'Madras Eye' infection: ఎందుకు వస్తుంది?

ఎడతెగని వర్షాల కారణంగానే ఈ మద్రాస్ ఐ సమస్య ఎక్కువగా ఉందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తమిళనాడులో ప్రస్తుతం ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. అలాగే, అల్పపీడన ప్రభావంతో ఈ నెలలో రెండు వారాలు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడ్డాయి. ఎండ లేకపోవడం, సూర్యరశ్మి పడకపోవడం, తేమగా ఉండడం తో ఈ conjunctivitis ఇన్ఫెక్షన్ త్వరగా వ్యాప్తి చెందుతోంది. ఈ ఇన్ఫెక్షన్ సోకినవారికి కళ్లు ఎర్రగా మారడం, కళ్లల్లో వాపు, కళ్ల నుంచి నీరు రావడ, కళ్లల్లో మంట.. మొదలైన లక్షణాలుంటాయి. ఈ conjunctivitis ఇన్ఫెక్షన్ బారిన పడే వారిలో చిన్నపిల్లలే అధికం. పిల్లల్లో స్వల్ప జ్వరం కూడా ఉంటుంది.

తదుపరి వ్యాసం