తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Noida Lotus Boulevard Death : కుక్కలు ఎందుకు కరుస్తాయి? మీదకు వస్తే ఏం చేయాలి

Noida Lotus Boulevard death : కుక్కలు ఎందుకు కరుస్తాయి? మీదకు వస్తే ఏం చేయాలి

Anand Sai HT Telugu

19 October 2022, 8:05 IST

    • Noida Dog Attack : నోయిడాలో ఓ చిన్నారిని కుక్క కరిచింది. దీంతో చిన్నారి మృతి చెందాడు. కానీ అందరికీ పెద్ద ప్రశ్న.. కుక్కలు ఎందుకు కరుస్తాయి. అలాంటి సంఘటనలను ఎలా నివారించవచ్చు? శునకాలు దూకుడుగా మీ వద్దకు వస్తే ఏం చేయాలి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

ప్రతీకాత్మక చిత్రం

నోయిడా(Noida)లోని పాష్ లోటస్ బౌలేవార్డ్ సొసైటీ హృదయ విదారక సంఘటన జరిగింది. వీధికుక్క చిన్నారిని పేగులను చీల్చి చంపింది. ఈ ఘటన జంతు ప్రేమికులకు, స్థానికులకు మధ్య వాగ్వాదానికి దారితీసింది. చిన్నారి తల్లి దినసరి కూలీ. ఆమె నోయిడా సెక్టార్ 100 సొసైటీలో పనిలో ఉంది. పిల్లవాడిపై కుక్క దాడి చేసింది. చిన్నారి అరుపులు విన్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని జంతువును అక్కడి నుంచి తరిమికొట్టారు.

చిన్నారిని నోయిడాలోని యథార్త్ ఆసుపత్రిలో చేర్చారు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటి పోయింది. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చిన్నారి చనిపోయాడు. వీధి కుక్కల బెడదపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తమ సొసైటీ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

అయితే ఇక్క పెద్ద ప్రశ్న ఏంటంటే.. కుక్కలు(Dogs) ఎందుకు కరుస్తాయి. అలాంటి సంఘటనలను ఎలా నివారించవచ్చు? అని అందరి సహజంగానే వస్తుంది. కుక్కలు బెదిరింపులకు గురైనప్పుడు, సంభోగం సమయంలో, తమ భూభాగాన్ని అతిక్రమించినప్పుడు దాడి చేస్తాయని పీపుల్ ఫర్ యానిమల్స్‌(People For Animals) సభ్యులు చెబుతున్నారు. అంతేకాదు.. కుక్కలు పిల్లలను ప్రసవించిన తర్వాత దూకుడుగా మారతాయి.

కుక్కలు దూకుడుగా మీ వద్దకు వస్తే ఏమి చేయాలి? పరిగెత్తడం, అరవడం లేదా దూకడం వంటి ఆకస్మిక కదలికలు చేయవద్దు. కుక్క కరిచే అవకాశం ఉంది. ఎలాంటి శబ్ధం చేయకుండా సైలెంట్ గా ఉండటం బెటర్. భయపడినట్టుగా కనిపించకూడదు. శునకాలు ఇట్టే పసిగడతాయి. ప్రశాంతంగా నిలబడాలి.

కుక్కలు ఎక్కువగా భూభాగం, వనరులు, సహచరుల కోసమే కాస్త వింతగా ప్రవర్తించి.. మనషుల మీదకు వస్తాయని పలవురు చెబుతున్నారు. అయితే.. చాలామంది కుక్కల దాడులకు కుక్క ప్రేమికులను నిందిస్తున్నారు. ఎందుకంటే జంతు ప్రేమికులు తరచుగా జంతువులకు మిగిలిపోయిన వాటిని తినిపిస్తారు. కానీ వాటిని సకాలంలో టీకాలు వేయడం, డాక్టర్ సందర్శనలు మొదలైన వాటిపై శ్రద్ధ వహించరు అనే ఆరోపణ ఉంది.

యానిమల్ బర్త్ కంట్రోల్(Animal Birth Control) (కుక్కలు) రూల్స్ 2001 ప్రకారం, వీధి కుక్కల నియంత్రణ కోసం కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. కానీ జంతువులకు ఆహారం ఇవ్వడంపై నియమాల గురించి చెప్పలేదు. నిబంధనల ప్రకారం కుక్కలకు వ్యాక్సినేషన్(Dogs Vaccination), స్టెరిలైజేషన్ ప్రక్రియలను కేంద్రం సూచించింది. వీధి కుక్కల జనాభాను పర్యవేక్షించడానికి ప్యానెల్లను ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించింది. కుక్క కాటుకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి స్థానిక అధికారులు జంతు హెల్ప్‌లైన్‌(Help Line)ను ఏర్పాటు చేస్తారు.

తదుపరి వ్యాసం