Infant mauled by dog: వీధి కుక్క దాడిలో ఏడు నెలల చిన్నారి మృతి-infant mauled by dog in noida society dies locals protest ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Infant Mauled By Dog: వీధి కుక్క దాడిలో ఏడు నెలల చిన్నారి మృతి

Infant mauled by dog: వీధి కుక్క దాడిలో ఏడు నెలల చిన్నారి మృతి

HT Telugu Desk HT Telugu
Oct 18, 2022 07:35 PM IST

Infant mauled by dog: వీధి కుక్క దాడిలో ఏడు నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. దీనిపై స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ధర్నా చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

తల్లిదండ్రులు నిర్మాణ రంగంలో కూలీలుగా ఉన్నారు. తాము పని చేస్తున్న ప్రదేశానికి దగ్గరలో ఏడు నెలల బాబును పడుకోబెట్టి, పనిలోకి వెళ్లారు.

Infant mauled by dog: వీధి కుక్క దాడి..

అంతలో, అక్కడికి వచ్చిన ఒక వీధి కుక్క ఆ శిశువుపై దాడి చేసి, తీవ్రంగా గాయపర్చింది. అది గమనించిన అక్కడి కార్మికులు ఆ శిశువును కాపాడే లోపే తీవ్రంగా గాయపర్చి, పారిపోయింది. సోమవారం మధ్యాహ్నం నోయిడాలోని సెక్టార్ 100లో ఉన్న లోటస్ బౌల్వర్డ్ హౌసింగ్ సొసైటీ లో ఈ దారుణం జరిగింది.

Infant mauled by dog: ఆసుపత్రికి..

అనంతరం, ఆ బాలుడిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్ పొందుతూ సోమవారం రాత్రి ఆ బాలుడు చనిపోయాడు. ఈ ఘటనపై అక్కడి హౌజింగ్ సొసైటీ లోని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల బెడదపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మంగళవారం ఉదయం తమ సొసైటీ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

IPL_Entry_Point