KCR Media Channels : కేసీఆర్ పాన్ ఇండియా స్ట్రాటజీ.. దిల్లీ కేంద్రంగా నేషనల్ ఛానళ్లు?-kcr planning to launch media channels for national politics ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Kcr Planning To Launch Media Channels For National Politics

KCR Media Channels : కేసీఆర్ పాన్ ఇండియా స్ట్రాటజీ.. దిల్లీ కేంద్రంగా నేషనల్ ఛానళ్లు?

Anand Sai HT Telugu
Oct 04, 2022 03:18 PM IST

KCR National Politics : టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా మారబోతోంది. పలు కీలక నిర్ణయాలను ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. మరి ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లాలంటే ఎలా? బీఆర్ఎస్ పార్టీని సిద్ధాంతాలు ప్రజల ముందటికి తీసుకెళ్లాలంటే మీడియా స్ట్రాటజీ ఉండాలని కేసీఆర్ అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ (Stock Photo)

ఈ కాలంలో రాజకీయ పార్టీ అజెండాలు, అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియా(Media) కీలక పాత్ర పోషిస్తోంది. చాలా పార్టీలకు సొంత ఛానళ్లు ఉన్నాయి. అయితే కేసీఆర్ జాతీయ పార్టీ(KCR National Party) ముహూర్తం దగ్గరకు వచ్చింది. బీజేపీ(BJP) విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లోని ముఖ్యనేతలో సమావేశమయ్యారు. ఇందులో భాగంగానే.. ప్రజలకు చేరువయ్యేందుకు నేషనల్ ఛానళ్లను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

జాతీయ స్థాయిలో ఉన్న ఇతర పార్టీలకు మీడియా ఉంది. కేసీఆర్ కూడా.. మీడియా స్ట్రాటజీ పాటించాలని చూస్తున్నట్టుగా సమాచారం. ఇందులో భాగంగానే.. తమ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. దిల్లీ కేంద్రంగా హిందీ, ఇంగ్లీష్ ఛానళ్ల(English News Channel) ఏర్పాటు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సీనియర్ జర్నలిస్టులతో కేసీఆర్(KCR) సమావేశమైనట్టుగా తెలుస్తోంది. కొత్త ఛానళ్లు ఏర్పాటు చేద్దామా? లేదంటే.. శాటిలైట్ అనుమతులు ఉన్న ఛానళ్లను కొనుగోలు చేద్దామా? అనే విషయంపై చర్చిస్తున్నట్టుగా సమాచారం. ఇదే విషయంపై టీఆర్ఎస్ కీలక వ్యక్తులు.. దిల్లీలో సీనియర్ జర్నలిస్టులతో సంప్రదింపులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

జాతీయ పార్టీ(National Party) ఏర్పాటు నేపథ్యంలో ప్రత్యేక విమానాన్ని కేసీఆర్ ఏర్పాటు చేసుకోనున్నట్టు సమచారం. 12 సీట్లున్న విమానాన్ని బుక్ చేయాలని టీఆర్ఎస్(TRS) భావిస్తోంది. భారతీయ రాష్ట్ర సమితి (BRS) ప్రారంభించిన తర్వాత రాబోయే నెలల్లో దేశం అంతటా తిరిగేందుకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో వేర్వేరు గమ్యస్థానాలకు వెళ్లే సమయంలో ఈ ఫ్లైట్ ఉపయోగపడనుంది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చార్టర్డ్ విమానాలను వాడుతున్నారు. విమానం ఎనిమిది సీట్లు లేదా 12 సీట్లు ఉండవచ్చనే ఊహాగానాలు చెలరేగినప్పటికీ, టీఆర్‌ఎస్(TRS) అధినేత ఆరు సీట్ల జెట్‌కు ఒకే అన్నట్టుగా తెలుస్తోంది.

అయితే దీని ఖ‌రీదు సుమారు రూ.80 కోట్ల వరకూ ఉంటుదని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిధుల‌ను పార్టీ నేత‌ల నుంచి విరాళాల రూపంలో సేక‌రించే అవకాశం ఉంది. పార్టీ వ‌ద్ద ఇప్పటికే రూ.865 కోట్ల నిధులున్నట్టుగా తెలుస్తోంది. వీటిని జాతీయ‌స్థాయి స‌భ‌లు, స‌మావేశాల‌కు, పార్టీ సంబంధిత ఖ‌ర్చుల‌కు ఉపయోగించే ఛాన్స్ ఉంది.

WhatsApp channel