Who will succeed PM Modi : మోదీ తర్వాత.. అమిత్ షా ప్రధాని అవ్వాలన్నదే భారతీయుల ఆకాంక్ష!
10 February 2024, 8:20 IST
- Who will next PM after Modi : నరేంద్ర మోదీ తర్వాత.. బీజేపీలో ప్రధాని అయ్యే అవకాశం, అర్హత ఎవరికి ఉంది? అన్న ప్రశ్నపై ఓ సర్వే జరిగింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
మోదీ తర్వాత.. అమిత్ షా ప్రధాని అవ్వాలన్నదే భారతీయుల ఆకాంక్ష!
Mood of the Nation survey : 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయం ఖాయమని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఇటీవలే విడుదలైన “మూడ్ ఆఫ్ ది నేషన్” సర్వే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. మోదీ.. హ్యాట్రిక్ కొడతారని తేల్చేసింది. అయితే.. ఇదే సర్వేలో మరో ఆసక్తికర విషయం బయటకి వచ్చింది. మోదీ తర్వాత ప్రధాని అయ్యే అవకాశం ఎవరికి ఉంది? ఓటర్లు ఏం అనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు చాలా మంది అమిత్ షా అని సమాధానం ఇచ్చారు!
మోదీ తర్వాత ప్రధానిగా అమిత్ షా..!
2014లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. నరేంద్ర మోదీ.. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు.. ఆయన ఛరిష్మా ఏమాత్రం తగ్గలేదు. 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటు అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను తన భుజాల మీద వేసుకుని, అన్ని తానై నడిపించారు మోదీ.
అయితే.. ఇప్పుడు మోదీ తర్వాత బీజేపీలో ఎవరు ప్రధాని అవుతారు? అన్న ప్రశ్న ఇప్పుడిప్పుడే ప్రజల్లో మొదలైనట్టు కనిపిస్తోంది. ఈ విషయంపై అందరిలో కుతుహలం కూడా ఉంది. ఇందుకు తగ్గట్టుగానే పలు సర్వేలు జరుగుతున్నాయి. ఒక్కో సర్వే ఒక్కో విధంగా చెబుతోంది. ఇటీవలే బయటకు వచ్చిన మూడ్ ఆఫ్ ది సర్వే మాత్రం అమిత్ షా పేరు చెప్పింది!
Who is next PM of India : మోదీ తర్వాత ఎవరు ప్రధాని అవ్వాలని కోరుకుంటున్నారు? అన్న ప్రశ్న.. తన సర్వేలో పెట్టింది మూడ్ ఆఫ్ ది నేషన్. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ- ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్లను ఆప్షన్లుగా ఇచ్చింది. అమిత్ షా ప్రధాని అవ్వాలని, ఆ పదవికి ఆయన నప్పుతారని 29శాతం మంది అభిప్రాయపడ్డారట. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి 25శాతం మంది ఓట్లు వేశారు. ఇక కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి 16శాతం ఓట్లు వచ్చాయి.
ఈ మూడ్ ఆఫ్ ది సర్వేలో దేశవ్యాప్తంగా ఉన్న లోక్‌సభ సీట్లల్లోని 35,801 మంది పాల్గొన్నారు. 2023 డిసెంబర్ 15 నుంచి 2024 జనవరి 28 వరకు ఈ సర్వే జరిగింది.
Who will succeed PM Modi : బీజేపీని ముందుండి నడిపిస్తున్న నాయకుడు ప్రధాని మోదీ. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ.. కమలదళం ఎన్నికల వ్యవహారాలను పక్కాగా ప్లాన్ చేసి, అమలు చేస్తోంది మాత్రం అమిత్ షానే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమిత్ షాని చాలా సార్లు బీజేపీ చాణిక్యుడు అని కూడా అంటారు. బీజేపీ ఎదుగుదలలో.. పార్టీ చీఫ్‌గా ఆయన కృషి చాలా ఉందని నిపుణులు చెబుతుంటారు.
మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఎప్పటి నుంచో రేసులో ఉన్నారు! బీజేపీలో కార్యకర్త నుంచి సీఎం స్థాయి వరకు చాలా వేగంగా ఎదిగారు ఆయన. కానీ సీఎంగా తన పనితీరుతో హైకమాండ్ నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. మరీ ముఖ్యంగా క్రిమినల్స్‌పై ఆయన తీసుకుంటున్న కఠిన చర్యలకు చాలా ప్రశంసలు లభిస్తున్నాయి.
Yogi Adityanath next PM : కానీ.. దేశవ్యాప్తంగా, రాజకీయాలకు అతీతంగా ప్రశంసలు పొందుతున్న బీజేపీ నేత ఎవరైనా ఉన్నారా? అంటే.. నితిన్ గడ్కరీ అనే సమాధనం వస్తుంది. ఆయనని 'ప్లాబ్లమ్ సాల్వర్'గా సంబోధిస్తూ ఉంటారు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళిపోతారు. విపక్షానికి చెందిన ఎందరో నేతలు కూడా ఆయన్ని ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి.
మరి మోదీ తర్వాత ఈ ముగ్గురిలో ఎవరు ప్రధాని అవుతారో వేచి చూడాలి. ఈలోపు.. మరో పేరు తెరపైకి వస్తుందా? అన్నది కూడా ఆసక్తికరంగానే ఉంది.