తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Elections: డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ భారతీయ రాజకీయ నాయకులైతే.. వారి ప్రచారం ఇలా ఉంటుందట!

US elections: డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ భారతీయ రాజకీయ నాయకులైతే.. వారి ప్రచారం ఇలా ఉంటుందట!

Sudarshan V HT Telugu

02 November 2024, 19:40 IST

google News
  • US elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో రెండు రోజుల్లో జరగనున్నాయి. డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు కమల హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ లు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఆ ఇద్దరు నేతలు భారత్ లో రాజకీయం చేస్తున్నట్లయితే, వారి ప్రచారం ఎలా ఉంటుందో ఒక కళాకారుడు ఇలా వివరించాడు.

భారతీయ రాజకీయ నాయకుడిగా ట్రంప్
భారతీయ రాజకీయ నాయకుడిగా ట్రంప్ (@sahixd/Instagram)

భారతీయ రాజకీయ నాయకుడిగా ట్రంప్

US president elections: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ అక్కడి కీలక రాష్ట్రాల్లో పోటాపోటీగా ర్యాలీలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. అయితే, వారిద్దరు అమెరికాలో కాకుండా, భారత్ లో ఎన్నికల్లో పోటీ పడుతున్నట్లయితే, వారి ప్రచారం ఎలా ఉంటుందో కృత్రిమ మేథ సహాయంతో ఒక కళాకారుడు చిత్రాల రూపంలో ఆవిష్కరించాడు.

భారత్ లో అయితే..

షాహిద్ ఎస్కే అనే ఆర్టిస్ట్ డొనాల్డ్ ట్రంప్ (donald trump), కమలా హ్యారిస్ లు భారతీయ రాజకీయ నాయకులుగా భారత్ లో ప్రచారం చేస్తే ఎలా ఉంటుందో తెలిపేందుకు ఏఐ జనరేటెడ్ ఫోటోలను రూపొందించారు. వాటిని తన ఇన్స్టాగ్రామ్ (instagram) ఖాతాలో పోస్ట్ చేశారు. భారత్ లో ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఎలా ప్రచారం చేస్తారో ఆ చిత్రాల్లో వివరించారు.

రోడ్ షోలు, దళితుల ఇళ్లల్లో భోజనాలు..

ఈ కళాకారుడు తన ఇన్ స్టా పేజీలో పోస్ట్ చేసిన ఒక చిత్రంలో ట్రంప్, హారిస్ (kamala harris) ఓపెన్ జీప్ లో రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఆయన వెంట ఆయన మద్దతుదారుడు, అమెరికన్ బిలియనీర్ ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. రోడ్ షోలు నిర్వహించడమే కాకుండా, ఇద్దరు నాయకులు ఓటర్ల పిల్లలను ఎత్తుకుని ముద్దు చేయడం, విజయ చిహ్నాలను చూపించడం, దళితుల గృహాలలో భోజనం చేయడం వంటివి చేస్తున్న చిత్రాలు ఉన్నాయి. సాధారణంగా భారత్ లో ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఇలాంటివన్నీ చేస్తుంటారు.

యూఎస్ లో ప్రచారం చివరి దశ

కమలా హారిస్, ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చివరి వారంలో ముఖ్యమైన రాష్ట్రాల్లో పోటీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. స్వింగ్ స్టేట్స్ లేదా పర్పుల్ స్టేట్స్ అని పిలిచే బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాలు రెండు ప్రధాన రాజకీయ పార్టీలు-డెమోక్రటిక్, రిపబ్లికన్-బలమైన మద్దతును కలిగి ఉంటాయి. ఈ రాష్ట్రాలు ప్రతి ఎన్నికలలో స్థిరంగా ఒక పార్టీకి ఓటు వేయవు. అందువల్ల అవి ఒక ఎన్నికల నుండి మరొక ఎన్నికలకు పార్టీల మధ్య స్వింగ్ అవుతుంటాయి.

నార్త్ కరోలినా..

ఎన్నికలకు మూడు రోజుల ముందు శనివారం నార్త్ కరోలినాలో ప్రచారం చేయడానికి ట్రంప్, హ్యారిస్ వేర్వేరుగా వెళ్తున్నారు. కమలా హారిస్, ట్రంప్ ఇద్దరూ ఒకే రోజు బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాన్ని సందర్శించడం ఇది వరుసగా నాలుగో రోజు.

తదుపరి వ్యాసం