తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Weather Update Today : ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం.. రాష్ట్రాల వారీగా వాతావరణ అంచనా!

Weather Update Today : ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం.. రాష్ట్రాల వారీగా వాతావరణ అంచనా!

Anand Sai HT Telugu

04 September 2024, 9:16 IST

google News
    • Today Weather Update : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం వరదలు తగ్గుముఖం పట్టాయి. అయితే వర్షాలు మాత్రం మరికొన్ని రోజులు పడనున్నాయి. గుజరాత్‌లో బుధవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. నేటి పూర్తి వాతావరణం, వర్షపాత అంచనాను రాష్ట్రాల వారీగా ఇక్కడ చూడండి.
ఐఎండీ వెదర్ అలర్ట్
ఐఎండీ వెదర్ అలర్ట్ (Unsplash)

ఐఎండీ వెదర్ అలర్ట్

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షపాతం నమోదైంది. ఇది మరికొన్ని రోజులు కొనసాగుతుందని ఐఎండీ అంచనా వేసింది. భారీ వర్షాలు గుజరాత్‌లోని అనేక ప్రాంతాలలో వరదలకు కారణమైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కుండపోత వర్షాల నుండి ఉపశమనం పొందవచ్చని అంచనా వేయబడింది. కానీ తేలికపాటి వానలు పడే అవకాశం ఉంది. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

దిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో సాధారణంగా మేఘావృతమైన ఆకాశంతో తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. గుజరాత్‌లో ఈరోజు కూడా విపరీతమైన వర్షపాతం కొనసాగుతుందని హెచ్చరించింది. ప్రస్తుతం నైరుతి మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం నెలకొని ఉందని తెలిపింది. సెప్టెంబరు 5, 2024 నాటికి పశ్చిమ-మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో తాజా అల్పపీడన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అంచనా.

ఈ వారం పొడవునా పశ్చిమ, మధ్య భారతదేశం అంతటా తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం విస్తృతంగా ఉంటుంది. సెప్టెంబరు 3న గుజరాత్‌లో అత్యంత భారీ వర్షపాతంతో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు సెప్టెంబర్ 4న సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలతో పాటు పశ్చిమ మధ్యప్రదేశ్‌, గుజరాత్ ప్రాంతంలో చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

కొంకణ్, గోవా, గుజరాత్ ప్రాంతంలో రాబోయే ఏడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా ఉంది. పశ్చిమ మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, కచ్‌లలో సెప్టెంబర్ 3 నుండి 7 వరకు భారీ వర్షాలు కురుస్తాయని, తూర్పు మధ్యప్రదేశ్‌లో సెప్టెంబర్ 4, 5 తేదీలలో భారీగా వానలు పడే అవకాశం ఉంది.

విదర్భ ప్రాంతంలో సెప్టెంబర్ 4 తేదీలో, ఛత్తీస్‌గఢ్‌లో సెప్టెంబర్ 4 నుండి 9 వరకు, మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాలలో సెప్టెంబర్ సెప్టెంబర్ 6, 9 మధ్య భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.

జమ్మూ కశ్మీర్, లడఖ్, గిల్గిత్, ల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో వారం పొడవునా అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో పంజాబ్, హర్యానా-చండీగఢ్-ఢిల్లీలో చెదురుమదురు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రానున్న 7 రోజుల్లో తూర్పు రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురువనున్నాయని ఐఎండీ చెప్పింది.

ఉత్తరాఖండ్‌లో సెప్టెంబర్ 3 నుండి 6 వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానాలో సెప్టెంబరు 3న వర్షాలు పడనున్నాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో సెప్టెంబర్ 5న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో సెప్టెంబర్ 5, 6 తేదీల్లో ఉండవచ్చు. పశ్చిమ రాజస్థాన్‌లో సెప్టెంబర్ 3 నుండి 7 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ వారం పొడవునా కోస్టల్ కర్ణాటక, కేరళ, మహే, లక్షద్వీప్‌లలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, తెలంగాణలలో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, రాయలసీమ, కర్ణాటకలలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్టల్ ఆంధ్ర ప్రదేశ్, యానాం, కోస్టల్ కర్ణాటకలో సెప్టెంబర్ 3 నుండి 7 వరకు. తెలంగాణలో సెప్టెంబర్ 3, 4వ తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అండమాన్, నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో వారం పొడవునా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ కాలంలో గంగా పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశాలో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడనున్నాయి. రాబోయే 7 రోజులలో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం