Siddharth and Aditi Rao : రాజస్థాన్‌లో ఎంజాయ్ చేస్తున్న సిద్ధార్థ్, అదితి!
Siddharth and Aditi Rao : సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ సంబంధంపై కొంత కాలంగా చర్చ నడుస్తోంది. ఎక్కడకు వెళ్లినా.. ఇద్దరు కలిసే వెళ్తున్నారు. వీరి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

నటి అదితి రావ్ హైదరీ(Aditi Rao Hydari) తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం సినిమా కార్యక్రమాలకు కాస్త విరామం ఇచ్చి వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. నటుడు సిద్ధార్థ్(Siddharth)తో కలిసి కనిపిస్తోంది. సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ గత కొంత కాలంగా కలిసి ఉంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే అందుకు నిదర్శనంగా కొన్ని ఫొటోలు వైరల్‌గా మారాయి. ఇప్పుడు ఈ జంట పక్షులు రాజస్థాన్(Rajasthan) వెళ్లిపోయాయి. అక్కడ ఇద్దరూ కలిసి ఫోటోలు దిగారు.
అదితి, సిద్ధార్థ్ మధ్య రిలేషన్ ఉందని.. సాక్ష్యంగా ఎప్పుడూ ఏదో ఒక ఫొటో బయటకు వస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి రాజస్థాన్ వెళ్లిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. వీలయినంత త్వరగా వీరిద్దరు తమ రిలేషన్ షిప్ గురించి ఓపెన్ గా మాట్లాడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు .
అదితి రావ్ హైదరీకి పలు భాషల్లో డిమాండ్ ఉంది. బాలీవుడ్(Bollywood)లోనే కాకుండా సౌత్ ఇండియన్ సినిమాల్లోనూ నటించి పాపులారిటీ సంపాదించుకుంది. అలాగే సిద్ధార్థ్ తమిళం, తెలుగు, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ మధ్య సాన్నిహిత్యం రోజురోజుకు పెరుగుతోంది. ఖాళీ సమయాల్లో కలిసి గడిపిన అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ తాజాగా 'తుమ్ తుమ్..' పాటకు స్టెప్పులేశారు. ఇది సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. అంతకుముందు ఒకరికొకరు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. 'ప్రిన్సెస్ ఆఫ్ ది హార్ట్' అనే క్యాప్షన్‌తో అదితి ఫోటోను సిద్ధార్థ్ షేర్ చేశాడు. అయితే ఈ ఇద్దరితో శర్వానంద్(Sharwanand)కు ఫ్రెండ్ షిప్ ఉంది. శర్వా పెళ్లి(Sharwanand Marriage) కోసమే ఇద్దరూ అక్కడకు కలిసి వెళ్లినట్టున్నారు. నిశ్చితార్థానికి కూడా ఇద్దరూ కలిసే వచ్చారు. కొన్ని రోజులుగా వీరి మధ్య రిలేషన్ మీద బాగా చర్చ నడుస్తోంది.
అదితి రావ్ హైదరి పలు భాషల్లో నటిస్తోంది. దేశవ్యాప్తంగా ఆమెకు అభిమానులున్నారు. ఇటీవలే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైంది. వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు కేన్స్ చిత్రోత్సవంలో పాల్గొన్నారు. పలువురు భారతీయ నటీమణులు కూడా హాజరయ్యారు. అందరికీ ఈ అవకాశం లభించదు. అదితికి ఈ అవకాశం దక్కడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. గతేడాది కూడా అదితి రావ్ హైదరి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్(cannes film festival)లో భాగమైంది. ఈసారి మరోసారి అవకాశం దక్కించుకుంది.