తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Education In Canada : కెనడాలో చదువుకు ప్లాన్​ చేస్తున్నారా? ఈ 5 విషయాల్లో జాగ్రత్త!

Education in Canada : కెనడాలో చదువుకు ప్లాన్​ చేస్తున్నారా? ఈ 5 విషయాల్లో జాగ్రత్త!

Sharath Chitturi HT Telugu

24 August 2024, 7:20 IST

google News
  • Canada student education : కెనడాలో చదువుకునేందుకు ప్లాన్​ చేస్తున్నారా? వీసా ప్రాసెస్​, అప్లికేషన్​తో పాటు మీరు కొన్ని విషయాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. అక్కడి వాస్తవ పరిస్థితులతో జాగ్రత్తగా ఉండాలి. పూర్తి వివరాలు..

కెనడాలో చదువుకు ప్లాన్​ చేస్తున్నారా?
కెనడాలో చదువుకు ప్లాన్​ చేస్తున్నారా? (Mint)

కెనడాలో చదువుకు ప్లాన్​ చేస్తున్నారా?

చదువు కోసం విదేశాలకు వెళుతున్న భారతీయుల సంఖ్య ప్రతి యేటా పెరుగుతూ వస్తోంది. మరీ ముఖ్యంగా కెనడాలో చదువుకునేందుకు చాలా మంది భారతీయులు ఇష్టపడుతున్నారు. మీరు మీ అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుల కోసం కెనడాకు వెళ్లడానికి సిద్ధంగా ఉంటే, స్టూడెంట్ వీసా నుంచి అవసరమైన డాక్యుమెంట్ల వరకు అన్ని ఏర్పాట్లు చేసుకోవడం చాలా ముఖ్యం. వీటితో పాటు మరికొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఉదాహరణకు, కెనడాలో పార్ట్ టైమ్ జాబ్​ కనుగొనడం చాలా ఈజీ అని మీరు అనుకుంటే, భ్రమలో ఉన్నట్టే. అలాగే, డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగంలో చేరడం చాలా సులభం అని మీరు భావిస్తే.. వాస్తవ పరిస్థితులు చూసి షాక్​ అవ్వాల్సిందే! ఇలాంటి మరిన్ని విషయాలను ఇక్కడ తెలుసుకోండి.

కెనడాలో చదువు- మీరు జాగ్రత్తగా ఉండాల్సినవి:

1. కెనడాలో ఉద్యోగం వెతుక్కోవడం: కెనడాలో ఉద్యోగం సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. పరిమాణంలో కెనడా రెండవ అతిపెద్ద దేశం అయినప్పటికీ, ఆర్థిక వ్యవస్థ భారతదేశం కంటే చిన్నది! జీడీపీ పరంగా కెనడా పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగా, అమెరికా, చైనా, జపాన్, జర్మనీల తర్వాత భారత్ చాలా ముందంజలో ఉంది.

అంతేకాదు పెద్ద దేశం అయినప్పటికీ, కెనడా 40 మిలియన్ల కంటే తక్కువ జనాభాను కలిగి ఉంది. చాలా అవకాశాలు టొరంటో, వాంకోవర్ వంటి ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. కెనడా భూభాగంలో 42 శాతానికి పైగా అడవులు ఉన్నాయి.

2. పార్ట్ టైమ్ ఉద్యోగాలు: పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తారనే భావనతో చాలా మంది భారతీయ విద్యార్థులు కెనడాకు వెళ్తుంటారు. కానీ పార్ట్ టైమ్ జాబ్​ను కూడా వెతుక్కోవడం అనేది ఇటీవలి కాలంలో చాలా కష్టంగా మారింది.

వాంకోవర్​లో ఫాస్ట్​ఫుడ్​ జాయింట్ టిమ్ హోర్టన్స్ వద్ద వందలాది మంది భారతీయ విద్యార్థులు క్యూ కట్టిన వీడియో.. అక్కడి పరిస్థితులకు నిదర్శనం.

3. ఎక్కువ మంది విద్యార్థులు, చాలా తక్కువ వీసాలు: కెనడా ఇటీవల జారీ చేసిన స్టడీ పర్మిట్ల సంఖ్య చాలా పెరిగింది. ఈ సంఖ్యను 35 శాతం తగ్గించాలని కెనడా ప్రభుత్వం నిర్ణయించింది.

ఇమ్మిగ్రేషన్ మినిస్టర్​ మార్క్ మిల్లర్ పంచుకున్న డేటా ప్రకారం 2024 లో 364,000 కొత్త పర్మిట్లను ఆమోదిస్తారు. ఇది గత సంవత్సరం జారీ చేసిన విద్యార్థి వీసాల సంఖ్య (5,60,000) కంటే 35 శాతం తక్కువ.

4. మీ సొంతంగా ఇంటి పనులు చేయడం: ఇది కొంతమందికి సంబంధించినది కానప్పటికీ, ఇంటి పనులను సొంతంగా చేయడానికి చాలా సందేహించే విద్యార్థులు కెనడాలో నివసించడానికి ఇష్టపడకపోవచ్చు. ఇక్కడ మీరు వంట నుంచి శుభ్రపరచడం, మీ బాయిలర్ లేదా డోర్ రిపేర్ చేయడం వంటి చిన్న చిన్న పనులు చేయవలసి ఉంటుంది.

5. నగరాల మధ్య ఎక్కువ దూరం: నగరాల మధ్య ప్రయాణించినప్పుడు, దూరాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ఒట్టావా నుంచి ఒంటారియో 3,754 కి.మీ దూరంలో ఉంటుంది. హాలిఫాక్స్ మానిటోబా నుంచి 2,719 కి.మీ దూరంలో, మానిటోబా న్యూ బ్రున్స్విక్ మధ్య దూరం 2,415 కి.మీ ఉంటుంది.

తదుపరి వ్యాసం