Indian students in Canada : కెనడాలో ఉద్యోగాల కోసం ఇలా క్యూ కట్టిన భారతీయులు- వీడియో వైరల్..
Indian students in Canada : కెనడాలో ఉద్యోగ అవకాశాల కోసం భారతీయులు క్యూ కట్టిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కెనడాలో ఉద్యోగాలు లేవని అక్కడి వారు చెబుతున్నారు.
Jobs in Canada : అమెరికాలోనే కాదు.. ఇప్పుడు కెనడాలో కూడా ఉద్యోగాలు దొరకడం లేదు! మరీ ముఖ్యంగా.. ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థులు, కోర్సు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాలు దొరకకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నారు. ఈ పరిస్థితికి అద్దంపట్టే విధంగా తాజాగా ఓ ఘటన జరిగింది. కెనడాలోని టిమ్ హోర్టన్ అవుట్‌లెట్‌లో జరిగిన జాబ్ మేళాకు వందలాది మంది భారత విద్యార్థులు హాజరయ్యారు. గంటల పాటు భారీ క్యూలో నిలబడ్డారు.
ఈ భారీ క్యూకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. టొరంటోలో పార్ట్ టైమ్ ఉద్యోగం కోసం నెలల తరబడి వెతికిన భారతీయ విద్యార్థిని నిషాత్.. ఈ వీడియోను షేర్ చేశాడు.
23 ఏళ్ల నిషాత్ హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. కెనడాలో ఉద్యోగం కోసం ఆరు నెలలకు పైగా గడిపానని, కానీ ఇప్పటివరకు ఫలితం దక్కలేదని చెప్పాడు.
Indian students in Canada : “అకౌంటింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు కోసం ఆరు నెలల క్రితం కెనడా వచ్చాను. అప్పటి నుంచి పార్ట్ టైమ్ జాబ్ కోసం వెతుకుతున్నాను. కెనడాలో బతకడానికి చాలా మంది భారతీయ విద్యార్థులు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తుంటారు. జీవన వ్యయం చాలా ఎక్కువగా ఉంది. నేను ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నాను,” అని చెప్పాడు.
“ఇంత వయస్సొచ్చి, కుటుంబసభ్యులను డబ్బులు అడుగుతుంటే అవమానకరంగా ఉంది. పైగా.. స్నేహితులకు ఉద్యోగం వచ్చి, మనకి రాకపోతే.. ఇంకా బాధగా ఉంటుంది,” అని నిషాత్ చెప్పుకొచ్చాడు.
"పైగా మీతో సమస్య ఉన్నందునే మీరు ఉద్యోగం సంపాదించుకోవడం లేదని అందరు అనుకుంటున్నారు. కానీ కెనడాలో ఉద్యోగాల్లేవు. ఈ విషయం ఇప్పుడిప్పుడే ప్రజలు గ్రహించడం ప్రారంభించారు," అని నిషాత్ హెచ్‌టితో అన్నాడు.
అయితే ఆశలు వదులుకోని నిషాత్ ఇటీవల టొరంటోలో జరిగిన టిమ్ హార్టన్ జాబ్ మేళాకు వెళ్లాడు. నిర్దిష్ట సమయం కంటే 30 నిమిషాల ముందే జాబ్ మేళాకు చేరుకున్నానని, అప్పటికే అక్కడ సుదీర్ఘ క్యూ కనిపించిందని యార్క్ యూనివర్శిటీ విద్యార్థి తన వీడియోలో చెప్పాడు.
ఆ వీడియోలో.. చాలా మంది క్యూలో నిలబడినట్టు కనిపిస్తోంది. వారిలో 90శాతం మంది భారతీయులే ఉంటరని నిషాత్ అంచనా వేశాడు.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోను ఇక్కడ చూడండి..
జాబ్ మేళాకి వచ్చే ముందు.. తన సీవీని ప్రింట్ తీసుకోవడానికి 2 డాలర్లు ఖర్చు చేసినట్లు నిషాత్ చెప్పాడు. ఉద్యోగం పొందే అవకాశాలను పెంచుకోవడానికి తన సీవీని పూర్తిగా అప్డేట్ చేశానని తన వీడియోలో పేర్కొన్నాడు. "కానీ నేను టిమ్ హోర్టన్కి చేరుకున్నప్పుడు.. నా ముందు చాలా పెద్ద లైన్ కనిపించింది," అని అన్నాడు.
"అంత పెద్ద క్యూ చూసి చుట్టుపక్కల ఉన్న శ్వేతజాతీయులు సైతం షాక్‌కు గురయ్యారు,' అని నిషాత్ పేర్కొన్నాడు.
టిమ్ హోర్టన్ సిబ్బంది.. విద్యార్థులను వారి షెడ్యూల్ గురించి అడిగారని, వారి సీవలను తీసుకుని పంపించేశారని, షార్ట్ లిస్ట్ చేస్తే ఇంటర్వ్యూ కాల్ వస్తుందని చెప్పారని నిషాత్ చెప్పాడు.
Canada jobs viral video : టిమ్ హోర్టన్స్లో తన సీవీని సమర్పించిన తరువాత, నిషాత్ మరొక దుకాణంలో ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి చాలా దూరం ప్రయాణించాడు.
‘నా పరిస్థితి కూడా ఇంతే’ అంటూ నిషాత్ పోస్ట్‌పై కెనడాలోని భారతీయులు కామెంట్లు చేస్తున్నారు.
"కెనడాలో అనవసరమైన రద్దీ కారణంగా, మనుగడ కోసం ఉద్యోగం కనుగొనడం దాదాపు అసాధ్యం" అని ఒకరు కామెంట్ చేశారు.
"10 నెలలు గడిచాయి, నేను ఇంకా ఉద్యోగం కోసం చూస్తున్నాను" అని మరొకరు చెప్పారు. "6 నెలల నుంచి నేను నా పార్ట్ టైమ్ ఉద్యోగం కోసం చూస్తున్నాను!" అని మూడొవ యూజర్ కామెంట్ చేశాడు. '7 నెలలు గడుస్తున్నా ఇంకా నిరుద్యోగం లేదు' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
కెనడాలో భారతీయ విద్యార్థులు ఉద్యోగ అవకాశాల కొరతతో ఎలా కష్టపడుతున్నారో అక్టోబర్ 2023లో, పీటీఐ నివేదిక హైలైట్ చేసింది. '
టొరంటో, ఇతర కెనడియన్ నగరాలలో అధిక జీవన వ్యయం కూడా ఇక్కడి విద్యార్థులను బాధిస్తోంది, వారు అద్దె ఇతర ఉపయోగాలను ఆదా చేయడానికి ఇరుకైన గదుల్లో నివసించాల్సి వస్తోంది.
సంబంధిత కథనం