తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Putin Girlfriend : గర్ల్​ఫ్రెండ్​తో సీక్రెట్​గా ఎంజాయ్​ చేస్తున్న పుతిన్​.. ఆ ప్యాలెస్​లో..!

Putin girlfriend : గర్ల్​ఫ్రెండ్​తో సీక్రెట్​గా ఎంజాయ్​ చేస్తున్న పుతిన్​.. ఆ ప్యాలెస్​లో..!

Sharath Chitturi HT Telugu

02 March 2023, 8:58 IST

    • Vladimir Putin girlfriend : రష్యా అధ్యక్షుడు పుతిన్​ ఇప్పుడెక్కడున్నారు? అన్న ప్రశ్నకు ఓ నివేదిక సమాధానం చెప్పింది. తన గర్ల్​ఫ్రెండ్​తో కలిసి పుతిన్​..ఓ ప్యాలెస్​లో ఉన్నట్టు పేర్కొంది.
పుతిన్​
పుతిన్​ (AP)

పుతిన్​

Vladimir Putin girlfriend : ఉక్రెయిన్​తో యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​కు సంబంధించిన వార్తలు వైరల్​గా మారుతున్నాయి. తాజాగా పుతిన్​కు సంబంధించి మరో వార్త బయటకొచ్చింది. తన గర్ల్​ఫ్రెండ్​, పిల్లలతో కలిసి పుతిన్​.. మాస్కోకు సమీపంలోని ఓ విలాసవంతమైన ప్యాలెస్​లో గడుపుతున్నట్టు ఓ నివేదిక పేర్కొంది. రష్యా బడ్జెట్ నిధుల​ నుంచి అక్రమంగా డబ్బులు తరలించి ఈ ప్యాలెస్​ను నిర్మించినట్టు గతంలో ఆరోపణలు వచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

గర్ల్​ఫ్రెండ్​తో.. ప్యాలెస్​లో..

39ఏళ్ల జిమ్నాస్ట్​ అలినా కబేవాతో పుతిన్​ రిలేషన్​లో ఉన్నట్టు గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు.. వీరిద్దరు మాస్కోకు వాయువ్యంవైపు ఉన్న లేక్​ వాల్దైకు సమీపంలోని ఓ ఎస్టేట్​లో ఉంటున్నట్టు రష్యన్​ ఇన్​వెస్టిగేటివ్​ న్యూస్​ సైట్​ 'ది ప్రాజెక్ట్​' వెల్లడించింది.

Vladimir Putin latest news : 120 మిలియన్​ డాలర్లు వెచ్చించి, ఈ ఎస్టేట్​ను రెండేళ్ల క్రితం కొనుగోలు చేశారు పుతిన్​. నిర్మాణ పనులు 2020లో మొదలై.. రెండేళ్లల్లో ముగిశాయి. ఆ తర్వాత, గర్ల్​ఫ్రెండ్​తో కలిసి పుతిన్​ అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఎస్టేట్​.. 13వేల చదరపు అడుగల విస్తీర్ణంలో నిర్మించారు. గతంలో బయటకొచ్చిన ఫొటోల ప్రకారం.. ఈ ఎస్టేట్​లో బంగారంతో తయారు చేసిన కుర్చీలు, టేబుల్స్​ వంటి వస్తువులు ఉన్నాయి.

ప్యాలెస్​లో అలినా కబేవాతో పాటు కొందరు పిల్లలను కూడా చూసినట్టు ఓ అధికారి చెప్పారని నివేదిక పేర్కొంది. అలినాకు చెందిన మహిళా బంధువులు కూడా ఎస్టేట్​లో ఉన్నట్టు వివరించింది. పుతిన్​, అలినాలు కలిసి ఉండటం తాము ఎప్పుడు చూడలేదని పలువురు అధికారులు పేర్కొన్నారు. అలా అని వారిద్దరు రిలేషన్​లో లేరని కాదు అని వివరించారు.

బడ్జెట్​ డబ్బులతో..!

Russia Ukraine war : 2014లో రష్యా జాతీయ మీడియా బృందం బాధ్యతలను అలినాకు అప్పగించారు పుతిన్​. అప్పటి నుంచి ఆమెకు ప్రతియేటా 8.6 మిలియన్​ యూరోలు జీతంగా అందుతున్నాయి!

వ్లాదిమిర్​ పుతిన్​ ప్రత్యర్థి, ప్రస్తుతం జైలులో ఉన్న రష్యా విపక్ష నేత అలెక్సీ నావెల్నీ బృందం.. 2021లో తొలిసారి ఈ ఎస్టేట్​ వివరాలను బయటపెట్టింది. బడ్జెట్​ నిధులను దొంగలించి, ఈ ఎస్టేట్​కు నిర్మించారని నావెల్నీ బృందం ఆరోపించింది.