Zelensky calls Modi: ‘‘యుద్ధం ముగిసి, శాంతి నెలకొనేలా చూడండి’’-in zelensky call modi says india backs peace ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Zelensky Calls Modi: ‘‘యుద్ధం ముగిసి, శాంతి నెలకొనేలా చూడండి’’

Zelensky calls Modi: ‘‘యుద్ధం ముగిసి, శాంతి నెలకొనేలా చూడండి’’

HT Telugu Desk HT Telugu
Jan 08, 2024 09:47 PM IST

Zelensky calls Modi: రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధానికి ముగింపు పలికేలా జీ 20 తరఫున ముందుకు రావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కోరారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, భారత ప్రధాని మోదీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, భారత ప్రధాని మోదీ

Zelensky calls Modi: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేశారు. యుద్ధానికి రష్యా ముగింపు పలికేలా చూడాలని మోదీని కోరారు. జీ 20(G 20) అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

G 20 mediation: జీ 20 తరఫున మధ్యవర్తిత్వం

గత నెలలో ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ 20(G 20) సదస్సులో తాను ప్రతిపాదించిన శాంతి ఫార్మూలాను అమలు చేయడానికి ప్రస్తుతం జీ 20 (G 20) అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారత్ ముందుకు రావాలని ఈ సందర్బంగా మోదీని జెలెన్ స్కీ కోరారు. అయితే, ఆ ప్రతిపాదనపై నేరుగా స్పందించని మోదీ.. యుద్ధం (Russia Ukraine war) ముగిసి, శాంతి నెలకొనేందుకు తోడ్పడే ఈ శాంతి ప్రయత్నాలకైనా భారత్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రష్యా, ఉక్రెయిల్ మధ్య సంక్షోభం(Russia Ukraine war) ముగియడం ప్రపంచానికి ఇప్పుడు అవసరమని మోదీ పేర్కొన్నారు. తక్షణమే ఇరు దేశాలు యుద్ధానికి స్వస్తి పలకాలని కోరారు. దౌత్య మార్గాల ద్వారా, చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రష్యాతో యుద్ధం(Russia Ukraine war) ప్రారంభమైన తరువాత మోదీకి జెలెన్ స్కీ ఫోన్ చేయడం ఇది రెండో సారి. గతంలో అక్టోబర్ నెలలో కూడా జెలెన్ స్కీ మోదీకి ఒకసారి ఫోన్ చేశారు. రెండు వారాల క్రితమే మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ల మధ్య ఫోన్ సంభాషణ జరిగింది.

Zelensky calls Modi: సంక్షోభంపై సంభాషణ

భారత ప్రధాని మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ(Zelensky)ల మధ్య రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం(Russia Ukraine war)పై చర్చ జరిగింది. ఇరు దేశాలు తక్షణమే కాల్పుల విరమణ పాటించి, చర్చలు, దౌత్య మార్గాలతో సంక్షోభ పరిష్కారానికి కృషి చేయాలని ఈ సందర్భంగా మోదీ పునరుద్ఘాటించారు. ఆ ప్రాంతంలో శాంతి నెలకొనే దిశగా చేపట్టే ఏ చర్యకైనా భారత్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. యుద్ధం(Russia Ukraine war) కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ ప్రజలను భారత్ తరఫున సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. భారత ప్రధానితో మాట్లాడిన విషయాన్ని జెలెన్ స్కీ(Zelensky) ఆ తరువాత ఒక ట్వీట్ లో వెల్లడించారు. భారతదేశం చేపట్టిన జీ 20 (G 20) అధ్యక్ష బాధ్యతలు విజయవంతంగా కొనసాగాలని కోరుతూ మోదీకి శుభాకాంక్షలు తెలియజేశానని ఆ ట్వీట్ లో జెలెన్ స్కీ తెలిపారు.

Zelensky Bali speech: బాలీ స్పీచ్ లో ఏమన్నారు?

ఇండోనేషియాలోని బాలిలో గత నెలలో జరిగిన జీ 20(G 20) సదస్సులో జెలెన్ స్కీ(Zelensky) ప్రసంగించారు. ఈ సందర్భంగా జీ 20ని ఆయన రష్యాను మినహాయంచి జీ 19(G 19) అని సంబోధించారు. అలాగే. రష్యాతో సంక్షోభం(Russia Ukraine war) ముగియడానికి 10 పాయింట్ ఫార్మూలాను ప్రతిపాదించారు. ఆ ఫార్మూలాను అమలు చేయాలని ఇప్పుడు భారత ప్రధాని మోదీని Zelensky కోరారు. ఆ ప్రతిపాదనలో.. న్యూక్లియర్ సేఫ్టీ, ఫుడ్ సెక్యూరిటీ, ఎనర్జీ సెక్యూరిటీ, ఉక్రెయిన్ భూభాగాల పరిరక్షణ, యుద్ధ ఖైదీల విడుదల, రష్యా బలగాల ఉపసంహరణ, యుద్ధ విరమణ తదితర అంశాలున్నాయి.

Whats_app_banner

టాపిక్