Women diving with saree : ఆడవాళ్లు.. మీకు జోహార్లు- చీర కట్టులో డైవింగ్ చేస్తున్న మహిళలు!
07 February 2023, 11:54 IST
- Women wearing saree diving into river : తమిళనాడుకు చెందిన కొందరు మహిళలు చీరలో డైవింగ్ చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అలా చేయడం వారికి అలవాటేనని తెలుస్తోంది.
చీరలో నదిలోకి దూకేస్తున్న మహిళ
Women wearing saree diving into river : చెరువు, నదిలో ఈత కొట్టడం చాలా మందికి సరదా! ముఖ్యంగా చిన్న పిల్లలు స్విమ్మింగ్‌తో పాటు డైవింగ్ కూడా చేస్తూ ఉంటారు. అయితే.. ఎప్పుడైనా మహిళలు డైవ్ చేయడం చూశారా? అది కూడా చీర కట్టులో! అవును మీరు విన్నది నిజమే. తమిళనాడుకు చెందిన కొందరు మహిళలు.. చీరలో డైవింగ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే..
చిరలో డైవింగ్.. అలవాటే!
ఐఏఎస్ అధికారి సుప్రియ సాహూ.. ఈ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోను తమిళనాడుకు చెందిన థమిరబరణి నది వద్ద తీశారు. వీడియో నిడివి 20 సెకన్లు. కొందరు మహిళలు చాలా ధైర్యంగా నదిలోకి డైవ్ చేస్తుండటం వీడియోలో ఉంది. అది కూడా చీర కట్టులో!
Tamil Nadu women diving viral video : "ఈ వీడియో చూసి విస్మయానికి గురయ్యాను. చీర కట్టుకున్న మహిళలు.. చాలా సులభంగా నదిలోకి డైవ్ చేస్తున్నారు. కల్లిదైకురిచిలో తీసింది ఈ వీడియో. ఇదంతా వారికి సర్వ సాధారణమైన విషయమే అట," అని సుప్రియ సాహూ రాసుకొచ్చారు.
వీడియోలో కనిపిస్తున్న మహిళలు.. తరచూ అలా చీరలో డైవ్ చేస్తూ ఉంటారని సమచారం. వారికి అది ఎప్పటి నుంచో అలవాటైన విషయమే అని తెలుస్తోంది.
నెట్టింట మిశ్రమ స్పందన..
Women wearing saree diving video : సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియోకు ఇప్పటికే 50వేలకుపైగా వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన కొందరు 'వావ్' అంటుంటే.. మరికొందరు మిశ్రమంగా స్పందిస్తున్నారు.
"గ్రామాల్లో బావులు ఉంటాయి. వాటి పై నుంచి పురుషులు, మహిళలు, చిన్న పిల్లలు దూకడం గ్రామాల్లో సాధారణమైన విషయం. ఈ మహిళలు డైవింగ్ కళలో నైపుణ్యం పొందినట్టున్నారు," అని ఓ నెటిజెన్ రాసుకొచ్చారు.
కాగా.. కొందరు మహిళల భద్రత, నది పరిరక్షణపై సందేహాలు వ్యక్తం చేశారు.
Tamil Nadu viral video : "థమిరబరణి చాలా స్వచ్ఛమైన నది. అనవసరమైన కాలుష్యానికి ఈ నది గురి కాకూడదని నేను ప్రార్థిస్తున్నాను. దేశంలోని చాలా నదుల్లో ఇదే జరుగుతోంది. ఇక్కడ ఇలా జరగకుండా చూసుకోవాలి," అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. మరో నెటిజన్.."దేశంలోని మహిళలకు.. తమిళనాడు అత్యంత భద్రతమైన ప్రాంతంగా కనిపిస్తోంది. వావ్," అని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి :