తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Car Chase In New York : ఫాస్ట్​ అండ్​ ఫ్యూరియస్​ తరహా 'ఛేజ్'​.. వీడియో వైరల్​!

Car chase in New York : ఫాస్ట్​ అండ్​ ఫ్యూరియస్​ తరహా 'ఛేజ్'​.. వీడియో వైరల్​!

Sharath Chitturi HT Telugu

06 September 2022, 7:35 IST

    • Car chase scene in New York : న్యూయార్క్​ వీధుల్లో ఫాస్ట్​ అండ్​ ఫ్యూరియస్​ సినిమా రేంజ్​లో ఓ యాక్షన్​ ఛేజింగ్​ సీన్​ చోటుచేసుకుంది. ఓ కారు, మరో కారును వెంబడించి ఢీకొట్టింది. చివరికి ఏమైందంటే..
ఫాస్ట్​ అండ్​ ఫ్యూరియస్​ తరహా 'ఛేజ్'​.. వీడియో వైరల్​!
ఫాస్ట్​ అండ్​ ఫ్యూరియస్​ తరహా 'ఛేజ్'​.. వీడియో వైరల్​! (Twitter)

ఫాస్ట్​ అండ్​ ఫ్యూరియస్​ తరహా 'ఛేజ్'​.. వీడియో వైరల్​!

Car chase scene in New York : అమెరికా న్యూయార్క్​ వీధుల్లో ఫాస్ట్​ అండ్​ ఫ్యూరియస్​ సినిమా తరహా ఛేజింగ్​ సీన్​ జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు

ICSE results 2024 : ఐసీఎస్​ఈ క్లాస్​ 10, ఐఎస్సీ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్​కి రెండు రోజులే గడువు.. ఇలా అప్లై చేసుకోండి..

Criminal cases : 53-48.. క్రిమినల్​ కేసులున్న అభ్యర్థుల విషయంలోనూ టీడీపీ- వైసీపీ మధ్య తీవ్ర పోటీ!

Teacher student sex : 5వ తరగతి విద్యార్థితో ఎలిమెంటరీ స్కూల్​ టీచర్​ సెక్స్​- చివరికి..!

ఈ ఘటన శనివారం జరిగినట్టు తెలుస్తోంది. ఓ బ్లాక్​ మెర్సిడీస్​ కారు.. ఓ టయోటా ఆర్​ఏవీ4ని ఢీకొట్టింది. మెర్సిడీస్​ నుంచి తప్పించుకునేందుకు టయోటా కారు విపరీతంగా ప్రయత్నించింది. కానీ మెర్సిడీస్​ కారు.. టయోటా కారును పలుమార్లు ఢీకొట్టింది. అచ్చం సినిమాల్లో ఛేజింగ్​ సీన్లు చూపించినట్టుగానే శబ్ధాలు వచ్చాయి.

చివరికి.. టయోటా కారు ఆగిపోయింది. ఈ క్రమంలో బ్లాక్​ మెర్సిడీస్​ కారులో నుంచి దిగిన ఓ యువకుడు.. టయోటా కారు అద్దాలను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత.. డ్రైవర్​ నుంచి ఓ బ్యాగు లాగేసుకుని, మెర్సిడీస్​ కారులో అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

ఈ ఘటనను అక్కడే ఉన్న స్థానికుడు తన ఫోన్​లో చిత్రీకరించాడు. "అతని వద్ద గన్​ ఉంది. అతని వద్ద గన్​ ఉంది," అంటూ.. ఓ వ్యక్తి అరవడం వీడియోలో రికార్డు అయ్యింది.

ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగతనానికి గురైన బ్యాగులో 20వేల డాలర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎవరిని అరెస్ట్​ చేయలేదు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన వీడియోను ఇక్కడ చూడండి: