తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Aap Mla Slapped : ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టిన భర్త.. వైరల్ మారిన వీడియో!

AAP MLA slapped : ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టిన భర్త.. వైరల్ మారిన వీడియో!

02 September 2022, 20:36 IST

పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్‌ను ఆమె భర్త బహిరంగంగా చెప్పపై కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే ఇంటి బయట ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైన దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఘటన జూలై 10న జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదు. షాకింగ్ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఎమ్మెల్యే భర్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు, ఒక ప్రజాప్రతినిధిపై ఇలాంటి ఘటన జరిగితే సాధారణ పౌరులకు ఏమి రక్షణ ఉంటుందని మండిపడుతున్నారు . పంజాబ్ మహిళా ప్యానెల్ ఈ ఘటనపై సుమోటాగా విచారణ చేపట్టింది.