తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  చావుని అత్యంత దగ్గరగా చూసిన మహిళ.. వీడియో వైరల్​

చావుని అత్యంత దగ్గరగా చూసిన మహిళ.. వీడియో వైరల్​

Sharath Chitturi HT Telugu

04 September 2022, 19:10 IST

    • Woman escapes from accident : రోడ్డు మీద అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ మహిళకు కూడా ఇదే ఎదురైంది. కానీ లక్​తో బయటపడింది. ఒళ్లుగగుర్పొడిచే దృశ్యాలను ఇక్కడ చూడండి.
చావుని అత్యంత దగ్గరగా చూసిన మహిళ.. వీడియో వైరల్​
చావుని అత్యంత దగ్గరగా చూసిన మహిళ.. వీడియో వైరల్​ (Twitter)

చావుని అత్యంత దగ్గరగా చూసిన మహిళ.. వీడియో వైరల్​

Woman escapes from accident : చావును అత్యంత దగ్గరగా చూసిన ఓ మహిళకు సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఓ కారు మరో ఆటోను ఢీకొట్టి.. ఆ రెండు ఆ మహిళవైపు దూసుకెళ్లడం ఆ వీడియోలో కనిపించింది.

ఈ వీడియోను ఐపీఎస్​ అధికారి వీ సజ్జనార్​ తన ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేశారు. వీడియోలో ఓ మహిళ.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతోంది. అక్కడ ఓ ఆటో కనిపిస్తోంది.

కొన్ని క్షణాల తర్వాత.. ఆ ఆటోను వెనక నుంచి ఓ కారు ఢీకొట్టింది. ఆ రెండు గాలిలోకి ఎగిరాయి. ఆ మహిళవైపు దూసుకెళ్లాయి. కానీ ఆ మహిళకు చాలా లక్​ ఉంది! దాదాపు ఢీకొట్టినంత సమయంలో.. ఆ రెండు వాహనాలు ఆ మహిళ పక్క నుంచి వెళ్లాయి. అలా ఆ మహిళ.. ప్రమాదం నుంచి తప్పించుకుంది.

"చివరి నిమిషంలో ఆ మహిళ తప్పించుకుంది. కానీ.. ఇలా ఇంకెంత కాలం లక్​ మీద ఆధాపడి ఉంటాము? రోడ్డు మీద డ్రైవింగ్​ చేసేడప్పుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించండి," అని వీడియో కింద రాసుకొచ్చారు సజ్జనార్​.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా వైరల్​ అయ్యింది. "డ్రైవింగ్​తో పాటు రోడ్డు మీద నడవడం కూడా బాధ్యతాయుతంగానే ఉండాలి. అసలు రోడ్డు మీద వెళుతుంటేనే జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రమాదాలనేవి రోడ్డు మీదే ఆధారపడి ఉంటుంది," అని ఓ నెటిజన్​ రాసుకొచ్చారు.

"ట్రాఫిక్​ రూల్స్​ను ఉల్లంఘిస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే బుద్ధి వస్తుంది," అని ఇంకో నెటిజన్​ పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన వీడియోను ఇక్కడ చూడండి:

తదుపరి వ్యాసం