US gun control bill : అమెరికాలో కొత్త చట్టం.. ఇక ‘గన్ కల్చర్’కు చెక్!
24 June 2022, 11:11 IST
US gun control bill : ఆయుధాలకు సంబంధించి అమెరికాలోని సెనేట్‌లో ఓ బిల్లు పాస్ అయ్యింది. త్వరలో ఇది చట్టంగా మారే అవకాశం ఉంది.
అమెరికాలో కొత్త చట్టం.. ఇక ‘గన్ కల్చర్’కు చెక్!
US gun control bill : అమెరికాలో 'గన్ కల్చర్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయుధాలతో మారణహోమాలు జరుగుతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ సమస్య అమెరికాను పట్టిపీడిస్తోంది. దీనిని అధిగమించే దిశగా అమెరికాలో అడుగులు పడుతున్నాయి! గన్ కల్చర్‌ను నియంత్రించే విధంగా రూపొందించిన ద్వైపాక్షిక బిల్లు ఒకటి.. అమెరికా సెనేట్‌లో ఆమోదం పొందింది. ఆయుధాల చట్టాల సంస్కరణపై అమెరికా స్పందించడం.. 30ఏళ్లల్లో ఇదే తొలిసారి.
65-33 ఓట్ల తేడాతో సెనేట్‌లో ఆ బిల్లు గట్టెక్కింది. 15మంది రిపబ్లికెన్లు.. అధికార డెమొక్రాట్లకు మద్దతు పలకడం విశేషం. శుక్రవారమే.. ఈ బిల్లు ప్రతినిధుల సభ ముందుకు వెళుతుందని తెలుస్తోంది. అక్కడ గట్టెక్కితే.. అధ్యక్షుడు జో బైడెన్ వద్దకు వెళుతుంది. ఆయన సంతకంతో ఆ బిల్లు.. చట్టంగా మారుతుంది.
US gun violence : ఇది 13.2బిలియన్ డాలర్ల బిల్లు! మానసిక ఆరోగ్యం, స్కూళ్ల భద్రత, సంక్షోభ నివారణ, నియంత్రణ కార్యక్రమాలు ఈ బిల్లులో భాగం.
అమెరికాలో ప్రజల వద్ద 390మిలియన్‌కు పైగా తుపాకులు ఉన్నాయి. ఒక్క 2020లోనే.. 45వేలకుపైగా మంది అమెరికన్లు ఆయుధాల సంబంధిత ఘటనల్లో మరణించారు. ఆయుధాలతో కొందరు మారణహోమాన్ని సృష్టిస్తుంటే.. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
టెక్సాస్ షూటింగ్ అనంతరం.. ఆయుధాల చట్టాల్లో మార్పులు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్న తరుణంలో.. సెనేట్‌లో బిల్లు పాస్ అవ్వడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకుంటున్నారు.
టాపిక్