తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Narendra Modi: ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడి ‘స్టేట్ విజిట్’ ఆహ్వానం.. ఎప్పుడు వెళతారంటే..!

PM Narendra Modi: ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడి ‘స్టేట్ విజిట్’ ఆహ్వానం.. ఎప్పుడు వెళతారంటే..!

02 February 2023, 7:13 IST

    • Joe Biden Invites PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి స్టేట్ విజిట్ ఆహ్వానం పంపారు అమెరికా అధ్యక్షుడు డో బైడెన్. పూర్తి వివరాలివే..
PM Narendra Modi: ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడి ‘స్టేట్ విజిట్’ ఆహ్వానం
PM Narendra Modi: ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడి ‘స్టేట్ విజిట్’ ఆహ్వానం

PM Narendra Modi: ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడి ‘స్టేట్ విజిట్’ ఆహ్వానం

Joe Biden Invites PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అమెరికా నుంచి ఆహ్వానం అందించింది. తమ దేశానికి రావాలంటూ మోదీకి ‘స్టేట్ విజిట్’ ఆహ్వానం పంపారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఈ విషయాన్ని పీటీఐ రిపోర్టు వెల్లడించింది. మోదీ అమెరికా పర్యటనకు భారత్‍ కూడా అంగీకరించింది. బైడెన్ ఆహ్వానానికి ఓకే చెప్పింది. అయితే ఇరు మోదీ, బైడెన్.. ఇద్దరికీ అనుకూలంగా ఉండే తేదీల కోసం ఇరు దేశాల అధికారులు చూస్తున్నారని సంబంధింత వర్గాల నుంచి సమాచారం వెల్లడైంది. మరి అమెరికాకు మోదీ ఎప్పుడు వెళ్లే అవకాశం ఉందంటే..

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

ప్రధాని అయ్యాక అమెరికాకు మోదీ.. ఆరుసార్లు వెళ్లారు. అయితే, స్టేట్ విజిట్‍కు అమెరికా అధ్యక్షుడి నుంచి తొలిసారి ఆయన ఆహ్వానం అందుకున్నారు. స్వయంగా అమెరికా అధ్యక్షుడి నుంచే అధికారంగా ఆహ్వానం అందుకొని అధికారిక అతిథిగా అక్కడ పర్యటించడమే స్టేట్ విజిట్. ఈ పర్యటనకు వెళితే అమెరికా ప్రతినిధుల సభ, సెనెట్‍లను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. వైట్ హౌస్‍లో బైడెన్ ఇచ్చే స్టేట్ డిన్నర్ విందుకు హాజరవుతారు.

ఆ సమయంలోనే!

Joe Biden Invites PM Modi: ఇండియాలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో జీ-20 సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా రానున్నారు. అయితే ఇంత కంటే ముందే అమెరికా పర్యటనకు మోదీ వెళ్లే అవకాశం ఉంది. జూన్, జూలై నెలల్లో మోదీ, బైడెన్ ఇద్దరికీ అనూకూలమైన తేదీలను ఖరారు చేసేందుకు ఇరు దేశాల అధికారులు కసరత్తులు చేస్తున్నారని సమాచారం. భారత ప్రధాని మోదీ స్టేట్ విజిట్‍ భారత్, అమెరికా ద్వైపాక్షిక బంధానికి మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఇరు దేశాల సఖ్యత మరింత బలపడుతుందని అంచనాలు ఉన్నాయి.

Joe Biden Invites PM Modi: జీ-20 సదస్సు భారత్‍లో సెప్టెంబర్‌లో జరగనుంది. అలాగే ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో కీలక ఎన్నికలు ఉన్నాయి. ప్రధాని మోదీ విస్తృతంగా బీజేపీ తరఫున ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. దీంతో ఈ సంవత్సరమంతా ఆయన చాలా బిజీబిజీగా ఉండనున్నారు. దీంతో అమెరికా పర్యటనకు జూన్ లేదా జూలై అనుకూలంగా కనిపిస్తోంది.

చివరగా స్టేట్ డిన్నర్‌ కోసం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్‍కు ఆతిథ్యమిచ్చారు అమెరికా అధ్యక్షుడు. భారత ప్రధానిగా చివరగా స్టేట్ విజిట్ చేసింది మన్మోహన్ సింగ్. 2009లో అమెరికా అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా.. మన్మోహన్‍కు ఆతిథ్యమిచ్చారు.