Mood of the Nation poll: భారీగా పెరిగిన ప్రధాని మోదీ ప్రభుత్వ పాపులారిటీ
Mood of the Nation poll: దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ప్రభుత్వ పాపులారిటీ భారీగా పెరిగింది. ఇండియా టుడే న్యూస్ చానెల్, సీ ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన దేశవ్యాప్త పోల్ మూడ్ ఆఫ్ ది నేషన్(Mood of the Nation poll) లో ఈ విషయం వెల్లడైంది.
Mood of the Nation poll: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రభుత్వ పాపులారిటీ దేశవ్యాప్తంగా భారీగా పెరిగింది. ఇదే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ గత సంవత్సరం ఆగస్ట్ నెలలో నిర్వహించిన సమయంలో ప్రధాని మోదీ (PM Modi) ప్రభుత్వ పాపులారిటీ 56% గా ఉండగా, అది ప్రస్తుతం, అంటే జనవరి 2023 నాటికి 67 శాతానికి పెరిగింది. అలాగే, మోదీ (PM Modi) ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న ప్రజల శాతం కూడా 32 శాతం నుంచి 18 శాతానికి తగ్గడం గమనార్హం. గత ఎనిమిదేళ్లుగా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ.. ప్రభుత్వ వ్యతిరేకతను మోదీ ప్రభుత్వం అధిగమించినట్లు ఈ సర్వే ద్వారా తెలుస్తోంది.
Mood of the Nation poll: 2024 ఎన్నికల్లో..
2024 లో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రస్తుతం దేశ ప్రజల్లో వివిధ అంశాలపై నెలకొన్న అభిప్రాయాలపై సీ ఓటర్, ఇండియా టుడే ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ (Mood of the Nation poll) నిర్వహించాయి. దేశవ్యాప్తంగా అన్ని లోక్ సభ నియోజకవర్గాల్లోని సుమారు 39,909 మందిని ప్రశ్నించి, సమాచారం సేకరించారు. అలాగే, సీ ఓటర్ ట్రాకర్ డేటా నుంచి లక్ష మంది కి పైగా పౌరుల అభిప్రాయాలను సేకరించారు. 2022 డిసెంబర్ 15 నుంచి 2023 జనవరి 15 వరకు ఈ సర్వే నిర్వహించారు.
Mood of the Nation poll: ఇవే భారీ విజయాలు..
మోదీ (PM Modi) సాధించిన విజయాల్లో కొరోనా పై పోరాటం, కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్, అయోధ్యలో రామ మందిరం, జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 ను రద్దు చేయడం ప్రధానమైనవిగా దేశ ప్రజలు భావిస్తున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, నోట్ల రద్దు మొదలైన వాటిని మోదీ (PM Modi) ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యాలుగా తీర్పునిచ్చారు. ముఖ్యంగా ధరల పెరుగుదలను 25%, నిరుద్యోగాన్ని 17% అతిపెద్ధ వైఫల్యాలుగా నిర్ధారించారు. అలాగే, ఉమ్మడి పౌర స్మృతి అవసరమని 69% అభిప్రాయపడగా, అవసరం లేదని 19% స్పష్టం చేశారు. పాఠశాలల్లో హిజాబ్ ను నిషేధించాలని 57%, నిషేధించకూడదని 26% అభిప్రాయపడ్డారు.
On Rahul Gandhi: భారత్ జోడో యాత్రపై..
మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ లో పాల్గొన్నవారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) పై స్పందించారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) మంచి ప్రచారం పొందిందని, అయితే, దానివల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మాత్రం సాధ్యం కాదని సర్వేలో పాల్గొన్న వారిలో 37% మంది అభిప్రాయపడ్డారు. అయితే, దేశ ప్రజలతో కనెక్ట్ కావడానికి కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి ఈ యాత్ర (Bharat Jodo Yatra) చాలా ఉపయోగపడిందని 29% అభిప్రాయపడ్డారు. నాయకుడిగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) రీ బ్రాండింగ్ కు ఈ యాత్ర (Bharat Jodo Yatra) ఉపయోగపడిందని 13% తెలిపారు.