తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pakistan Media Praises Pm Modi : ‘దట్​ ఈజ్​ మోదీ’- ప్రధానిపై పాక్​ మీడియా ప్రశంసల వర్షం!

Pakistan media praises PM Modi : ‘దట్​ ఈజ్​ మోదీ’- ప్రధానిపై పాక్​ మీడియా ప్రశంసల వర్షం!

16 January 2023, 6:58 IST

    • Pakistan media praises PM Modi : ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించింది పాకిస్థాన్​ మీడియా! ఆయన నేతృత్వంలో ఇండియా దూసుకెళుతోందని అభిప్రాయాపడింది.
‘దట్​ ఈజ్​ మోదీ’- ప్రధానిపై పాక్​ మీడియా ప్రశంసల వర్షం!
‘దట్​ ఈజ్​ మోదీ’- ప్రధానిపై పాక్​ మీడియా ప్రశంసల వర్షం! (ANI)

‘దట్​ ఈజ్​ మోదీ’- ప్రధానిపై పాక్​ మీడియా ప్రశంసల వర్షం!

Pakistan media praises PM Modi : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా లభిస్తున్న ఆదరణ, గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అతి తక్కువ సమయంలో ప్రపంచంలోనే అగ్రనేతగా ఎదిగిన మోదీకి ఎన్నో దేశాల మీడియాలు పట్టంగట్టాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి పాకిస్థాన్​ కూడా చేరింది! భారత్​ను శత్రుదేశంగా భావించే పాక్​ సైతం.. మన ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

Indian students: భారతీయ విద్యార్థులకు ‘డీపోర్టేషన్’ ముప్పు; భారీగా నిరసనలు

దట్​ ఈజ్​ మోదీ..!

"ప్రపంచంపై తన ప్రభావాన్ని చూపించే స్థితికి భారత్​ను తీసుకెళ్లారు మోదీ," అంటూ ప్రశంసించింది పాక్​కు చెందిన ప్రముఖ వార్తాసంస్థ 'ది ఎక్స్​ప్రెస్​ ట్రిబ్యూన్​.' ఈ మేరకు.. ఒపీనియన్​ కాలంలో ఓ భారీ వ్యాసాన్నే ప్రచురించింది. ప్రధాని మోదీ నాయకత్వంలో.. భారత దేశం అంతర్జాతీయంగా ఎలా ఎదుగుతోంది అన్న విషయాన్ని రాసుకొచ్చింది. భారత దేశ ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో.. ఇండియా ఎంతో నైపుణ్యంగా వ్యవహరించి తన జీడీపీని 3 ట్రిలియన్​ డాలర్లకు పెంచుకుందని అని పేర్కొంది. అభివృద్ధి పథంవైపు దూసుకెళుతోందని స్పష్టం చేసింది ది ఎక్స్​ప్రెస్​ ట్రిబ్యూన్.

Pakistan media on PM Modi : పాకిస్థాన్​లోని ప్రముఖ రాజకీయ, భద్రత, రక్షణ నిపుణుడు షెహ్​జాద్​ చౌదరీ.. ఈ వ్యాసం రాశారు. భారత దేశ పురోగతి.. ప్రపంచాన్ని అబ్బుపరుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ నేతృత్వంలోని భారత దేశం.. విదేశీ విధానాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుందని పేర్కొన్నారు.

"వ్యవసాయంలో ఎకరానికి.. ఇండియా ఉత్పత్తి చేస్తున్న పంట.. ప్రపంచంలోనే మెరుగైన దశలో ఉంది. 1.4 బిలియన్​ జనాభా ఉన్నప్పటికీ.. ఇండియా స్థిరంగా, క్రియాత్మకంగా ముందడుకు వేస్తోంది. భారత దేశ బ్రాండ్​ను మోదీ పెంచినంతంగా.. మరే ఇతర ప్రధాని కూడా పెంచలేదు," అని ది ఎక్స్​ప్రెస్​ ట్రిబ్యూన్ వ్యాసంలో రాసుకొచ్చారు షెహ్​జాద్​ చౌదరీ.

ప్రశంసలే.. ప్రశంసలు..

PM Modi latest news : పాకిస్థాన్​లో భారత్​పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్టు కనిపిస్తోంది! ముఖ్యంగా ప్రధాని మోదీ పనితీరుపై దాయది దేశం నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. మోదీ నేతృత్వంలోని భారత విదేశీ విధానాలపై గత నవంబర్​లో ప్రశంసల వర్షం కురిపించారు పాక్​ మాజీ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​. విదేశీ విధానాల్లో భారత్​ స్వచ్ఛగా, స్వతంత్రంగా పనిచేస్తోందని పొగిడారు. అమెరికాను కాదని.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయగలిగే స్థితికి ఇండియా చేరిందని, ఇది చాలా గొప్ప విషయం అని స్పష్టం చేశారు. అందుకే ఇండియా అభివృద్ధివైపు పరుగులు పెడుతోందని అభిప్రాయపడ్డారు.

తదుపరి వ్యాసం