PM Modi's security breach: ప్రధాని మోదీ పర్యటనలో భద్రత వైఫల్యం
PM Modi's security breach: కర్నాటకలోని హుబ్బళిలో ప్రధాని మోదీ చేపట్టిన పర్యటనలో ఘోర భద్రత వైఫల్యం చోటు చేసుకుంది. ప్రధాని మోదీ వ్యక్తిగత భద్రత సిబ్బంది, స్థానిక పోలీసుల కళ్లు గప్పి, క్షణాల్లో ఒక యువకుడు మోదీ వాహనం వద్దకు చేరుకున్నాడు.
PM Modi's security breach: 26వ జాతీయ యువజన దినోత్సవాలను ప్రారంభించడం కోసం గురువారం ప్రధాని మోదీ కర్నాటకలోని హుబ్బళికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఆయన ఒక రోడ్ షోలో పాల్గొన్నారు. రోడ్ షోలో పాల్గొన్న సమయంలోనే ఈ భద్రత వైఫల్యం చోటు చేసుకుంది.
PM Modi's security breach: పూల దండ వేయడం కోసం..
హుబ్బళిలో ప్రధాని మోదీ (PM Modi) రోడ్ షో జరుగుతుండగా, రోడ్డు పక్కనున్న జనసందోహంలో నుంచి అకస్మాత్తుగా ఒక యువకుడు ముందుకు వచ్చి, ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న వాహనం దగ్గరికి వచ్చాడు. వాహనం డోర్ వద్ద నిల్చుని రోడ్డు పక్కన నిల్చుని తనపై పూలు చల్లుతున్న ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ (PM Modi) వద్దకు క్షణాల్లో చేరుకుని, తన దగ్గర ఉన్న పూలదండను ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఈ లోపు వెంటనే తేరుకున్న ప్రధాని వ్యక్తిగత భద్రత సిబ్బంది, స్థానిక పోలీసులు ఆ వ్యక్తిని అడ్డుకుని అక్కడి నుంచి తీసుకువెళ్లారు. అయితే, ప్రధాని మోదీ (pm modi) ఆ వ్యక్తి నుంచి పూల దండ తీసుకోవడంతో అతడు సంతోషంగా అక్కడి నుంచి వెళ్లాడు.
PM Modi's security breach: జాతీయ యువజన దినోత్సవం
ప్రతీ సంవత్సరం జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం (national youth festival) జరుగుతుంది. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. 26వ జాతీయ యువజన దినోత్సవాల్లో పాల్గొనడం కోసం ప్రధాని (PM Modi) గురువారం కర్నాటకకు వచ్చారు. అక్కడ గురువారం సాయంత్రం ఆయన యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సంవత్సరం ఈ ఉత్సవాల్లో పాల్గొనడం కోసం 7500 మంది ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. ఈ సంవత్సరం యువజన దినోత్సవ (national youth festival) థీమ్ గా ‘వికసిత యువత.. వికసిత భారత్’ను ఎంచుకున్నారు. ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది.
టాపిక్