UPSC Recruitment 2023 : వివిధ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్.. వివరాలివే!
08 July 2023, 12:45 IST
UPSC Recruitment 2023 : వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది యూపీఎస్సీ. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
వివిధ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్.. వివరాలివే!
UPSC Recruitment 2023 : డిప్యూటీ ఆర్కిటెక్ట్‌తో పాటు ఇతర పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ). ఈ మేరకు అప్లికేషన్ల కోసం ఆహ్వానించింది. ఈ దఫా రిక్రూట్మెంట్లో సంస్థకు చెందిన 71 వేకెన్సీలను భర్తీ చేయనుంది యూపీఎస్సీ. upsc.gov.in లోకి వెళ్లి అభ్యర్థులు తమ అప్లికేషన్లను దాఖలు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
జులై 8న మొదలయ్యే రిజిస్ట్రేషన్/ అప్లికేషన్ ప్రక్రియ.. ఈ నెల 27 వరకు కొనసాగనుంది.
వేకెన్సీ వివరాలు..
లీగల్ ఆఫీసర్:- 2 పోస్టులు.
సైంటిస్ట్ ఆఫీసర్:- 1 పోస్టు
డిప్యూటీ ఆర్కిటెక్ట్:- 53 పోస్టులు
UPSC Recruitment 2023 notification : సైంటిస్ట్ 'బీ':- 7 పోస్టులు
జూనియర్ సైంటిస్ట్ ఆఫీసర్:- 2 పోస్టులు
అసిస్టెంట్ డైరక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ:- 2 పోస్టులు
డైరక్టర్ జనరల్:- 1 పోస్టు
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్:- 3 పోస్టులు.
ఇదీ చూడండి:- Free Civils Coaching : ఫ్రీగా సివిల్స్ కోచింగ్ - బుక్స్ తో పాటు భోజన సౌకర్యం, నిబంధనలివే
ఎలిజెబులిటీ..
యూపీఎస్సీ రిక్రూట్మెంట్ 2023 కోసం అప్లై చేయాలని భావిస్తున్న వారు.. వయస్సు, విద్యార్హతకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లికేషన్ ఫీజు..
UPSC Recruitment 2023 apply online : ఏదైనా ఎస్బీఐ బ్రాంచ్‌లో రూ. 25 అప్లికేషన్ ఫీజును అభ్యర్థులు అందజేయవచ్చు. లేదా నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్, యూపీఐ పేమెంట్స్ కూడా చేయవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతర వివరాల కోసం యూపీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్..
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పడింది. మేనేజర్ స్కేల్ 2 (మెయిన్‌స్ట్రీమ్)లో 1000 వేకెన్సీలను ఈ దఫా రిక్రూట్మెంట్లో భర్తీ చేయనుంది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 1నే మొదలైంది. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 15 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌కు సంబంధించిన వివరాల తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.