Central bank of India : 1000 ఉద్యోగాల భర్తీకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్
Central bank of India recruitment 2023 : 1000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నోటిఫికేషన్‌లోని వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
Central bank of India recruitment 2023 : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పడింది. మేనేజర్ స్కేల్ 2 (మెయిన్‌స్ట్రీమ్)లో 1000 వేకెన్సీలను ఈ దఫా రిక్రూట్మెంట్లో భర్తీ చేయనుంది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 1నే మొదలైంది. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 15 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌కు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ 2023..
పోస్టు పేరు:- మేనేజర్ స్కేల్ 2 (మెయిన్‌స్ట్రీమ్)
వేకెన్సీలు:- 1000 పోస్టులు
అప్లికేషన్ తేదీలు:- జులై 1 నుంచి జులై 15 వరకు
ఆన్లైన్ పరీక్ష తేదీ:- ఆగస్టు 2/3 వారం.
అభ్యర్థుల వయస్సు పరిమితి- గరిష్ఠంగా 32ఏళ్లు. (నిబంధనలకు తగ్గట్టు సడలింపు ఉంటుంది.)
Central bank of India notification : విద్యార్హత- తాజా రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో పాల్గొనాలని భావిస్తున్న అభ్యర్థులకు గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి సీఏఐఐబీ, డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి.
ఫీజు:- ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 175 ప్లస్ జీఎస్టీ. ఇతరులకు రూ. 850 ప్లస్ జీఎస్టీ.
పేమెంట్ మోడ్స్:- రూపే, వీసా, మాస్టర్‌కార్డ్, మేస్ట్రో డెబిట్- క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, మొబైల్ వాలెట్స్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
వేకెన్సీలో రిజర్వేషన్ వివరాలు..
ఎస్సీ- 150 పోస్టులు
ఎస్టీ- 75 పోస్టులు
ఓబీసీ- 270 పోస్టులు
ఈడబ్ల్యూఎస్- 100 పోస్టులు
జనరల్- 405 పోస్టులు
మొత్తం- 1000 పోస్టులు.
ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేస్తున్న ఉద్యోగులు సైతం ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ పోస్టుకు ఎంపికైతే.. ప్రస్తుతం ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.
రిక్రూట్మెంట్ డ్రైవ్‌కు సంబంధించిన పూర్తి నోటిఫికేష్‌ను చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..
IBPS Recruitment 2023 apply online : 2023 సంవత్సరానికి గానూ వివిధ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 1వ తేదీన ప్రారంభమైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4045 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ ibps.in. ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికిి ఆఖరు తేదీ జులై 21, 2023. అప్లై చేసుకున్న అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో ఉండవచ్చు. ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష అక్టోబర్ నెలలో ఉంటుంది. ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. వారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం