IDBI Bank Recruitment: ఐడీబీఐ బ్యాంకులో 1,036 పోస్టులు: వివరాలు ఇవే-idbi issues notification for 1036 posts check details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Idbi Issues Notification For 1036 Posts Check Details

IDBI Bank Recruitment: ఐడీబీఐ బ్యాంకులో 1,036 పోస్టులు: వివరాలు ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
May 28, 2023 11:06 PM IST

IDBI Recruitment: కాంట్రాక్టు పద్ధతిలో 1,036 పోస్టుల భర్తీకి ఐడీబీఐ బ్యాంకు నోటిఫికేషన్ జారీ చేసింది. వివరాలు ఇక్కడ చూడండి.

IDBI Bank Recruitment: ఐడీబీఐ బ్యాంకులో 1,036 పోస్టులు: వివరాలు ఇవే
IDBI Bank Recruitment: ఐడీబీఐ బ్యాంకులో 1,036 పోస్టులు: వివరాలు ఇవే

IDBI Bank Recruitment: కాంట్రాక్టు విధానంలో 1,036 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‍ను ఐడీబీఐ బ్యాంక్ విడుదల చేసింది. దేశంలోని వివిధ బ్రాంచుల కోసం ఈ నియామకం చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు జూన్ 7 తేదీ ఆఖరు తేదీగా ఉంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆలోగా ఐడీబీఐ బ్యాంక్ అధికారిక వెబ్‍సైట్ idbibank.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు, దరఖాస్తు ప్రక్రియ గురించి ఇక్కడ చూడండి.

ట్రెండింగ్ వార్తలు

నోటిఫికేషన్ ప్రకారం, మే 24న ఈ పోస్టులకు ఆన్‍లైన్‍లో దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఆన్‍లైన్‍లో అప్లికేషన్ల సమర్పణకు జూన్ 7వ తేదీ ఆఖరు తేదీగా ఉంది. జూలై 2న పరీక్ష ఉంటుంది.

విద్యార్హత, వయోపరిమితి

20 సంవత్సరాల నుంచి 25 సంత్సరాల మధ్య వయసు ఉన్న వారు ఈ ఐడీబీఐ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‍సీ, ఎస్‍టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు మూడు సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఉంది. కొన్ని కేటగిరీలను బట్టి సడలింపు ఉంటుంది.

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు (గ్రాడ్యుయేట్లు) ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు నోటిఫికేషన్‍ను క్షుణ్ణంగా పరిశీలించాలి. విద్యార్హత, పోస్టుల ఖాళీలు, రిజర్వేషన్లు, వయోపరిమితి సహా అన్ని వివరాలు నోటిఫికేషన్‍లో ఉన్నాయి. idbibank.in వెబ్‍సైట్‍లో నోటిఫికేషన్ ఉంది.

ఎంపిక ప్రక్రియ, కాంట్రాక్టు విధానం

ఈ కాంట్రాక్ట్ బేసిస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష ఉంటుంది. దీంట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు ఉంటాయి. వీటి ఆధారంగా ఆ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఎగ్జిక్యూటివ్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులను ముందుగా ఓ సంవత్సరం కాంట్రాక్టు కింద ఐడీబీఐ నియమించుకుంటుంది. పర్ఫార్మెన్స్ నచ్చితే మరో రెండేళ్ల కాలానికి కాంట్రాక్టును పొడిగిస్తుంది. మూడేళ్ల పీరియడ్ పూర్తయ్యాక అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు సెలెక్షన్ ప్రాసెస్‍ను బట్టి అర్హత ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసుకుంటామని ఆ బ్యాంకు నోటిఫికేషన్‍లో పేర్కొంది. ఈ వివరాలను నోటిఫికేషన్‍లో అభ్యర్థులు.. దరఖాస్తు చేసే ముందే పరిశీలించాలి.

అప్లికేషన్ ఫీజు

ఎస్‍సీ, ఎస్‍టీ, దివ్యాంగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.200. ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.1,000 చెల్లించాలి.

అప్లికేషన్ ఇలా..

  • ముందుగా ఐడీబీఐ అధికారిక వెబ్‍సైట్ www.idbibank.in లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కెరీర్స్ ఆప్షన్‍పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత కరెంట్ ఓపెనింగ్స్ ఆప్షన్‍పై క్లిక్ చేస్తే రిక్రూట్‍మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ (ఆన్ కాంట్రాక్ట్) 2023-24 అని కనిపిస్తుంది.
  • దాని కింద అప్లయ్ హియర్ అని ఉంటుంది.
  • అప్లయ్ హియర్‌పై క్లిక్ చేసి.. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.
  • అనంతరం అడిగిన వివరాలు నమోదు అప్లికేషన్‍ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత ఫీజు చెల్లించాలి.
  • చివరగా అప్లికేషన్‍ను ప్రింటౌట్ తీసుకోవాలి.

IPL_Entry_Point