తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ibps Recruitment: వివిధ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్; 4 వేలకు పైగా ఖాళీలు

IBPS Recruitment: వివిధ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్; 4 వేలకు పైగా ఖాళీలు

HT Telugu Desk HT Telugu

01 July 2023, 13:39 IST

google News
    • క్లర్క్ ఉద్యోగాల భర్తీకి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4045 పోస్ట్ లను భర్తీ చేయనున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

2023 సంవత్సరానికి గానూ వివిధ బ్యాంకుల్లో క్లర్క్ పోస్ట్ ల భర్తీకి ఐబీపీఎస్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

లాస్ట్ డేట్ జులై 21..

ఈ నోటిఫికేషన్ (CRP Clerks-XIII) ద్వారా మొత్తం 4045 పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ ibps.in. ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికిి ఆఖరు తేదీ జులై 21, 2023. అప్లై చేసుకున్న అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్ష ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో ఉండవచ్చు. ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష అక్టోబర్ నెలలో ఉంటుంది. ఈ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. వారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ (Graduation ) పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీల అభ్యర్థులు రూ. 175 లను, ఇతరులు రూ. 850 లను, అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి.

How to apply: అప్లై చేయడం ఎలా?

ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి అభ్యర్థులు ముందుగా..

  • ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ ibps.in. ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీపై కనిపించే IBPS Clerk Recruitment 2023 లింక్ పై క్లిక్ చేయాలి.
  • వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
  • ఆ తరువాత, ఆ వివరాలతో లాగిన్ కావాలి.
  • అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయాలి.
  • అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
  • సబ్మిట్ బటన్ నొక్కి, అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని భద్రపర్చుకోవాలి. ఒక కాపీని ప్రింట్ తీసి పెట్టుకోవాలి.
  • Direct link to apply for IBPS Clerk Recruitment 2023
  • Detailed Notification Here 

తదుపరి వ్యాసం