తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Upsc Cds 2024 Admit Card: యూపీఎస్సీ సీడీఎస్ 2024 అడ్మిట్ కార్డ్స్ విడుదల; ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

UPSC CDS 2024 Admit Card: యూపీఎస్సీ సీడీఎస్ 2024 అడ్మిట్ కార్డ్స్ విడుదల; ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

HT Telugu Desk HT Telugu

Published Apr 12, 2024 04:19 PM IST

google News
    • UPSC CDS 2024 Admit Card: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ 2024 పరీక్షల అడ్మిట్ కార్డులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏప్రిల్ 12వ తేదీన విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ద్వారా తమ అడ్మిట్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
యూపీఎస్సీ సీడీఎస్ ఈ అడ్మిట్ కార్డ్

యూపీఎస్సీ సీడీఎస్ ఈ అడ్మిట్ కార్డ్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ సీడీఎస్ 2024 అడ్మిట్ కార్డు (UPSC CDS 2024 Admit Card) ను ఏప్రిల్ 12, 2024న విడుదల చేసింది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (Combined Defence Services CDS) 2024కు హాజరయ్యే అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in ద్వారా అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ upsconline.nic.in.

ఏప్రిల్ 21న పరీక్ష

సీడీఎస్ (UPSC CDS 2024) పరీక్షను 2024 ఏప్రిల్ 21న నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రెండో షిఫ్టులో పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి సెషన్ లో పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందే అభ్యర్థులు ఎగ్జామ్ హాళ్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తరువాత అభ్యర్థులెవరినీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.

యూపీఎస్సీ సీడీఎస్ 2024 అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్

యూపీఎస్సీ సీడీఎస్ 2024 పరీక్ష అడ్మిట్ కార్డు (UPSC CDS 2024 Admit Card) ను డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.

  • యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in ని ఓపెన్ చేయండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న యూపీఎస్సీ సీడీఎస్ అడ్మిట్ కార్డ్ 2024 లింక్ పై క్లిక్ చేయండి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
  • సబ్మిట్ పై క్లిక్ చేసి మీ అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోండి.
  • తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపర్చుకోండి.

ఎగ్జామ్ నిబంధనలు

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరూ తమ ఈ-అడ్మిట్ కార్డు (e-Admit Card) ప్రింటవుట్ ను వెంట తీసుకువెళ్లాలి. ఎగ్జామ్ హాళ్లో ఇన్విజిలేటర్ కు ఈ అడ్మిట్ కార్డును చూపించాల్సి ఉంటుంది. ఈ-అడ్మిట్ కార్డు చూపించని అభ్యర్థిని పరీక్ష రాసేందుకు అనుమతించరు. అభ్యర్థులు ప్రతి సెషన్లో తమ వెంట ఒక ఫోటో ఐడీ కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ను చూడవచ్చు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.
తదుపరి వ్యాసం