UPSC CDS II Exam 2023: రక్షణ దళాల్లో ఉద్యోగాలకు నేటి నుంచే రిజిస్ట్రేషన్; ఇలా అప్లై చేసుకోండి..
UPSC CDS II Exam 2023: కేంద్ర రక్షణ దళాల్లో ఉద్యోగావకాశాలు కల్పించే సీడీఎస్ II (CDS II) పరీక్షకు యూపీఎస్సీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పరీక్షకు మే 17వ తేదీ నుంచి యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in. ద్వారా అప్లై చేసుకోవాలి.
UPSC CDS II Exam 2023: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ II (UPSC CDS II Exam) పరీక్షకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి యూపీఎస్సీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మే 17వ తేదీ నుంచి యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in. ద్వారా అప్లై చేసుకోవాలి.
UPSC CDS II Exam 2023: జూన్ 6 వరకు..
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ II (UPSC Combined Defense Services CDS II Exam) పరీక్షకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు మే 17వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు upsc.gov.in. ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 7వ తేదీ నుంచి జూన్ 13 వ తేదీ వరకు upsc.gov.in. వెబ్ సైట్లో అప్లికేషన్ ఫామ్ లోని తప్పులను సరి చేసుకునే కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 349 పోస్ట్ లను భర్తీ చేయనున్నారు.
UPSC CDS II Exam 2023: వేకెన్సీ వివరాలు..
ఈ నోటిఫికేషన్ ద్వారా
- డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలటరీ అకాడెమీ (Indian Military Academy, Dehradun) లో 100 పోస్ట్ లు
- ఎఝిమల లోని ఇండియన్ నేవల్ అకాడెమీ (Indian Naval Academy, Ezhimala) లో 32 పోస్ట్ లు
- హైదరాబాద్ లోని ఎయిర్ ఫోర్స్ అకాడెమీ (Air Force Academy, Hyderabad) లో 32 పోస్ట్ లు
- చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీలో 185 పోస్ట్
లను భర్తీ చేయనున్నారు.
UPSC CDS II Exam 2023: పరీక్ష ఫీజు
ఈ పరీక్షకు సంబంధించిన విద్యార్హతలు, వయో పరిమితి, ఇతర వివరాల కోసం upsc.gov.in.వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ను పరిశీలించాలి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసే అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీ, మహిళలకు (Female/SC/ST) పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇతరులు అప్లికేషన్ ఫీగా రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును ఏదైనా ఎస్బీఐ శాఖలో కానీ, లేదా డెబిట్, క్రెడిట్, రూపే కార్డు ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, యూపీఐ పేమెంట్ ద్వారా కానీ చెల్లించవచ్చు.