తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Dakshayani Pandey : భళా 'దాక్షాయణి'.. 100శాతం స్కాలర్​షిప్​తో స్టాన్​ఫర్డ్​ వర్సిటీకి..!

Dakshayani Pandey : భళా 'దాక్షాయణి'.. 100శాతం స్కాలర్​షిప్​తో స్టాన్​ఫర్డ్​ వర్సిటీకి..!

06 January 2023, 13:23 IST

google News
    • Dakshayani Pandey : 12వ తరగతి చదువుతున్న దాక్షాయణి పాండే.. త్వరలోనే ప్రఖ్యాత స్టాన్​ఫర్డ్​ వర్సిటీలో చేరనుంది. 100శాతం స్కాలర్​షిప్​తో అక్కడ చదువుకోనుంది.
దాక్షాయణి పాండే
దాక్షాయణి పాండే (Google)

దాక్షాయణి పాండే

Dakshayani Pandey : ఉత్తర్​ ప్రదేశ్​లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ బాలిక.. అద్భుతం చేసింది! మనం తలుచుకుంటే.. ఎన్ని కష్టాలు ఎదురైనా, అనుకున్నది సాధించి తీరుతామని నిరూపించింది! తన ప్రతిభతో.. ప్రఖ్యాత అంతర్జాతీయ విశ్వవిద్యాలయం స్టాన్​ఫర్డ్​లో 100శాతం స్కాలర్​షిప్​ను సంపాదించుకుంది. త్వరలో.. మౌ గ్రామం నుంచి అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లనున్న ఆమె పేరు.. 'దాక్షాయణి పాండే'.

భళా దాక్షాయణి..

2023 సెప్టెంబర్​ ఇంటేక్​తో ప్రఖ్యాత స్టాన్​ఫర్డ్​ వర్సిటీలో చేరనుంది దాక్షాయణి. బయోఇంజినీరింగ్​లో మేజర్స్​, ఎంటర్​ప్రెన్యుర్​షిప్​లో మైనర్స్​ చేయనుంది. ప్రస్తుతం ఆమె 12వ తరగతి చదువుకుంటోంది.

Dakshayani Pandey Standford University : ఉత్తర్​ ప్రదేశ్​లోని మారుమూల గ్రామమైన మౌలో జీవిస్తున్నప్పటికీ.. దాక్షాయణి పాండే తల్లిదండ్రులకు చదువు విలువ తెలుసు. ఈ క్రమంలోనే వారు దాక్షాయణి ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించారు. ఎన్ని కష్టాలొచ్చినా.. తనకు అండగా నిలిచారు. 10వ తరగతిలో ఉన్నప్పుడు.. విద్యాజ్ఞాన్​లో చేరింది దాక్షాయణి. అక్కడ.. ఆమెకు మంచి విద్య లభించింది. అన్నింట్లోనూ రాణించే దాక్షాయణిని చూసి పొగడని వారంటూ ఎవరూ లేరు! ప్రతి విషయంలోనూ టాప్​-10 స్టూడెంట్స్​లో ఒకరిగా ఉంటూ వస్తోంది.

2021లో జరిగిన ఇండియా@75 నేషనల్​ యూత్​ ఐడియాథాన్​లో పాల్గొని విజేతగా నిలిచింది దాక్షాయణి పాండే. దేశీయంగా రూపొందించిన ఓ ఆటోమోటివ్​ ప్రోటోటైప్​తో.. విజేతగా నిలిచింది. కారులో ఉండిపోయి ప్రాణాలు కోల్పోతున్న పసికందుల జీవితాలను రక్షించే విధంగా ఉన్న ఈ ఆటోమోటివ్​ ప్రోటోటైప్​ ఎంతగానో ఉపయోగపడనుంది. ఫలితంగా అందరి మన్ననలు పొందింది. చదువులోనే కాదు.. స్వచ్ఛంద కార్యక్రమాల్లోనూ ముందుంటుంది. నలుగురు సాయం చేయాలనే భావనలు ఆమెలో ఉంటాయి.

Dakshayani Pandey Uttar Pradesh : స్టాన్​ఫర్డ్​లో ఇన్నోవేటివ్​ ఎంటర్​ప్రెన్యూర్​షిప్​లో పని చేయాలని కలలుకంటోంది దాక్షాయణి. భారత దేశ యువతలో.. ఎంటర్​ప్రెన్యూర్​షిప్​వైపు అడుగులు వేసేందుకు తాను ఉపయోగపడతానని చెబుతోంది. భవిష్యత్తులో.. భారత దేశంలో చిన్నారుల విద్యను మెరుగుపరిచేందుకు కృషిచేస్తానని అంటోంది దాక్షాయణి. ఫలితంగా వారి జీవితాలు అభివృద్ధి చెందుతాయని భావిస్తోంది.

దాక్షాయణి పాండే.. అనుకున్న సాధించి, నలుగురికి ఉపయోగపడాలని మనం కూడా కోరుకుందాము.

తదుపరి వ్యాసం