తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt: విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి మంచి ఛాన్స్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే

AP Govt: విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి మంచి ఛాన్స్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే

HT Telugu Desk HT Telugu

04 August 2022, 19:14 IST

google News
    • jagananna videshi vidya deevena: జగనన్న విదేశీ విద్యాదీవెన కింద ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి ఏపీ సర్కార్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
జగనన్న విదేశీ విద్యా దీవెన
జగనన్న విదేశీ విద్యా దీవెన (twitter)

జగనన్న విదేశీ విద్యా దీవెన

jagananna videshi vidya deevena 2022: విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. జగనన్న విదేశీ విద్యాదీవెన స్కీమ్ కింద ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఓ ప్రకటన విడుదలైంది. ఈ పథకం కింద ప్రపంచంలో టాప్‌ 200లోపు క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాంకుల్లో ఉన్న విదేశీ విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ అభ్యసించాలనుకునేవారికి అవకాశం దక్కనుంది. వీటిని అభ్యసించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. ఈ వర్గాలకు చెందిన 35 ఏళ్లలోపువారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.

ఈ స్కీమ్ కింద అప్లయ్ చేసుకునే వారికి డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియెట్‌ల్లో 60 శాతం మార్కులు మార్కులు వచ్చి ఉండాలి. ఎంబీబీఎస్‌ కోర్సుకు నీట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ప్రపంచంలో టాప్‌ 100లోపు ర్యాంకు ఉన్న విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో ప్రవేశం పొందితే ప్రభుత్వమే 100 శాతం ఫీజు చెల్లిస్తుంది. అలాగే 101 నుంచి 200లోపు ర్యాంకు కలిగినవాటిలో అడ్మిషన్‌ పొందితే రూ.50 లక్షలు.. 50 శాతం ఫీజుల్లో ఏది తక్కువ అయితే అది ప్రభుత్వం భరిస్తుంది.

డెడ్ లైన్...

విద్యార్థులు సెప్టెంబర్‌ 30లోగా https://jnanabhumi.ap.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ వివరాలు తెలిపింది. అర్హులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.

అర్హతలివే..

35 ఏళ్లలోపు ఉన్న వారందరూ అర్హులుగా గుర్తిస్తారు.

ఏపీలో స్థానికుడై ఉండాలి. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింపు.

ప్రతి ఏటా సెప్టెంబరు–డిసెంబరు, జనవరి–మే మధ్య అర్హుల గుర్తింపుకోసం నోటిఫికేషన్‌

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీతో ఎంపిక.

గతంలో 2016 –17 నుంచి లబ్ధిదారులుగా ఎంపిక చేసిన 3,326 మందికి రూ.318 కోట్లను బకాయిలుగా పెట్టారు. అంతకుముందు ఆర్థికంగా వెనకబడిన అగ్రకులాలకు వర్తింప చేయలేదు. ఇప్పుడు వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో సంవత్సరాదాయం రూ.6 లక్షల లోపు ఉన్నవారికి వర్తించేది. అయితే ఇప్పుడు ఆదాయ పరిమితి రూ.8 లక్షల లోపు ఉన్నవారికీ వర్తిస్తుంది. గతం ప్రభుత్వం హయంలో ఎస్సీలకు రూ. 15 లక్షలు, ఎస్టీలకు రూ. 15 లక్షలు, కాపులకు రూ.10 లక్షలు, బీసీలకు రూ.10 లక్షలు, మైనార్టీలకు రూ.15 లక్షల వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌. ఇప్పుడు టాప్‌ 100 యూనివర్శిటీల్లో సీటు వస్తే పూర్తిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

తదుపరి వ్యాసం