Mother kills daughter : కూతురు రిలేషన్లో ఉందని.. గొడ్డలితో నరికి చంపిన తల్లి!
31 October 2023, 13:40 IST
Crime news : కూతురు రిలేషన్లో ఉందని తెలుసుకున్న తల్లికి కోపం వచ్చింది. రిలేషన్లో నుంచి బయటకు రావాలని హెచ్చరించింది. కానీ ఆమె వినలేదు. కోపంతో.. సొంత కూతురిని గొడ్డలితో నరికి చంపింది ఆ మహిళ. యూపీలో జరిగింది ఈ ఘటన.
కూతురు రిలేషన్లో ఉందని.. గొడ్డలితో నరికి చంపిన తల్లి!
Mother kills daughter : ఉత్తర ప్రదేశ్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రిలేషన్ నుంచి బయటకు రావాలని చెప్పినా వినడం లేదన్న కారణంతో.. ఓ మహిళ, తన కూతురిని అతి కిరాతకంగా చంపేసింది!
ఇదీ జరిగింది..
ఉత్తర్ ప్రదేశ్ కౌషంబి అనే ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. స్థానికంగా నివాసముంటున్న శివ్పతి అనే మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. అబ్బాయికి పెళ్లి జరగ్గా.. అమ్మాయిలు మైనర్లు. కాగా.. తన 15ఏళ్ల కూతురు, గ్రామంలోని మరో అబ్బాయితో ప్రేమలో ఉన్నట్టు తెలుసుకుందు శివ్పతి. అతడిని మర్చిపోవాలని చాలాసార్లు చెప్పింది. అందుకు ఆ బాలిక వినలేదు. ఇదే విషయంపై అక్టోబర్ 2న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ప్రియుడిని అస్సలు విడిచిపెట్టనని తేల్చిచెప్పింది ఆ మైనర్. కోపంతో ఊగిపోయిన శివ్పతి.. కర్రలతో ఆమెను చితకబాదింది. అంతటితో ఆగకుండా.. గొడ్డలి తీసుకొచ్చి, బాలికను నరికి చంపేసింది!
బాలిక మరణవార్తను పోలీసులకు చెప్పకుండా.. మహిళకు సాయం చేశారు, ఆమె కుటుంబసభ్యులు. శివ్పతి మరో కూతురు, కోడలు కలిసి.. మృతదేహాన్ని మాయం చేసేందుకు సాయం చేశారు. మృతదేహాన్ని ఒక సంచిలో కుక్కి.. సమీపంలోని బావిలో పడేశారు.
ఇలా బయటపడింది..
UP crime news : కూతురిని చంపిన కొన్ని రోజులకు.. పోలీసుల వద్దకు వెళ్లింది శివ్పతి. తన బిడ్డ కనిపించడం లేదని, ఎవరో కిడ్నాప్ చేసిందని.. అక్టోబర్ 14న ఫిర్యాదు చేసింది.
"పొలం పనుల కోసం బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఇంటికి రాలేదు," అని మహిళ చెప్పింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలిక కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా ఫలితం దక్కలేదు.
చివరికి.. ఈ నెల 26న, కొందరు గ్రామస్థులు పోలీసులకు ఫోన్ చేశారు. బావిలో ఓ బాలిక మృతదేహం కనిపించినట్టు వివరించారు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
Mother kills daughter over love affair : ఈ కేసుపై దర్యాప్తు చేపడుతుండగా.. మరణించిన బాలిక తల్లి శివ్పతిపై పోలీసులు అనుమానాలు మొదలయ్యాయి. ఆమెను విచారించగా.. అసలు విషయం బయటపడింది.
"అవును. నేనే నా కూతురిని చంపేశాను. ఆ అబ్బాయిని మర్చిపోవాలని చెప్పాను. వినలేదు. అందుకే చంపేశాను. నా మీద డౌట్ రాకుండా ఉండాలని కిడ్నాప్ అని ఫిర్యాదు చేశాను," అని పోలీసులకు వెల్లడించింది నిందితురాలు.
శివ్పతిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. శివ్పతి మరో కూతురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మహిళ కోడలిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్టు అధికారులు వివరించారు.