తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Uk Visa Fee : యూకే వెళుతున్న వారికి బ్యాడ్​ న్యూస్​.. భారీగా పెరిగిన వీసా ఫీజు!

UK visa fee : యూకే వెళుతున్న వారికి బ్యాడ్​ న్యూస్​.. భారీగా పెరిగిన వీసా ఫీజు!

Sharath Chitturi HT Telugu

15 July 2023, 9:50 IST

  • UK visa fee latest news : చదువు కోసం, పర్యటన కోసం, ఉద్యోగం కోసం మీరు యూకేకు వెళ్లాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే మీకు ఓ బ్యాడ్​ న్యూస్​.

యూకే వెళుతున్న వారికి బ్యాడ్​ న్యూస్​.. భారీగా పెరిగిన వీసా ఫీజు!
యూకే వెళుతున్న వారికి బ్యాడ్​ న్యూస్​.. భారీగా పెరిగిన వీసా ఫీజు!

యూకే వెళుతున్న వారికి బ్యాడ్​ న్యూస్​.. భారీగా పెరిగిన వీసా ఫీజు!

UK visa fee latest news : యూకేకు వెళ్లాలని ప్లాన్​ చేస్తున్న భారతీయులకు బ్యాడ్​ న్యూస్​! వీసా ఫీజులను పెంచుతూ.. ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునక్​ కీలక నిర్ణయం తీసుకున్నారు. వీసా ఫీజుతో పాటు దరఖాస్తుదారులు చెల్లించే హెల్త్​ సర్​ఛార్జీలను కూడా పెంచుతున్నట్టు స్పష్టం చేశారు. ఎంత పెంపు ఉంటుంది? అన్న విషయంపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కానీ వీసా ఫీజు 15శాతం నుంచి 20శాతం వరకు పెరగొచ్చు అని పలు నివేదికలు చెబుతున్నాయి.

ఎందుకు ఈ నిర్ణయం..?

యూకేలోని పబ్లిక్​ సెక్టార్​లో పనిచేస్తున్న వారి జీతాలను పెంచేందుకు రిషి సునక్​ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యాయులు, పోలీసులు, జూనియర్​ డాక్టర్లు,ఇతర వర్కర్లు ఈ కేటగిరీ కిందకి వస్తారు. కనీసం 5- 7శాతం వరకు వారి జీతాలను పెంచే యోచనలో ఉన్నట్టు బ్రిటన్​ ప్రధాని ఇప్పటికే తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే.. ద్రవ్యోల్బణంపై భయాలు కొనసాగుతున్న వేళ, అప్పు చేసి జీతాలు పెంచే ఉద్దేశం లేదన్న ఆయన.. అందుకే వేరే మార్గాల ద్వారా నిధులను సమీకరిస్తున్నట్టు స్పష్టం చేశారు.

UK visa fee increase : "పబ్లిక్​ సెక్టార్​ ఉద్యోగుల జీతాన్ని పెంచాలని నిర్ణయించుకుంటే.. వేరే ఎక్కడి నుంచైనా నిధులు తెచ్చుకోవాలి. ప్రజల ట్యాక్స్​ల నుంచి తీసే ఉద్ధేశం నాకు లేదు. ద్రవ్యోల్బణం భయాల కారణంగా అప్పు చేయాలనీ లేదు," అని మీడియా సమావేశంలో వెల్లడించారు రిషి సునక్​.

ఇదీ చూడండి:- US H-1B visa news: హెచ్ 1 బీ వీసాదారుల కుటుంబ సభ్యులకు శుభవార్త

"అందుకే నిధుల కోసం కొన్ని మార్గాలను చూస్తున్నాము. దేశంలోకి వచ్చే ఇమ్మిగ్రెంట్స్​పై వేసే ఛార్జీలను పెంచాలని భావిస్తున్నాము. ఎన్​హెచ్​ఎస్​ (నేషనల్​ హెల్త్​ సర్వీస్​) సేవలు పొందేందుకు వీసా సమయంలో కొంత చెల్లించాల్సి ఉంటుంది. దానిని పెంచుతున్నాము. దీని ద్వారా మేము 1 బిలియన్​ బ్రిటన్​ పౌండ్​ను సమకూర్చుకోగలుగుతాము. వీసా ఫీజులు పెంచి చాలా రోజులైంది. అందుకే ఇప్పుడు పెంచాలని మేము తీసుకున్న నిర్ణయం సరైనదే," అని ప్రధాని పేర్కొన్నారు.

ఎంత పెరుగుతుందంటే..!

Rishi Sunak UK Visa fees : పలు నివేదికల ప్రకారం.. వర్కింగ్​ వీసా ఫీజు 15శాతం పెరగనుంది. ఇతర వీసాలపై ఛార్జీలు 20శాతం పెరుగుతాయి. 2015లో తొలిసారిగా ఇమ్మిగ్రేషన్​ హెల్త్​ సర్​ఛార్జ్​ను ప్రవేశపెట్టారు. అప్పట్లో అది అప్లికేషన్​కు 200 పౌండ్లుగా ఉండేది. 2018 నాటికి అది 400 పౌండ్లకు చేరింది. 2020కి 620 పౌండ్లు దాటేసింది. ఇక ఇప్పుడు ఈ ధర 1,035 పౌండ్లకు చేరుతుందని తెలుస్తోంది.

అయితే తాజా పెంపునకు సంబంధించిన వివరాలపై రానున్న నెలల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ చర్యలతో.. అమెరికా, ఫ్రాన్స్​తో పోల్చుకుంటే.. బ్రిటన్​లో పని కోసం వెళ్లే వారిపై అధిక భారం పడుతోందని నిపుణులు చెబుతున్నారు.

తదుపరి వ్యాసం