US visa: భారత్ లో 10 లక్షల వీసాల ప్రాసెసింగ్; అమెరికా ప్రకటన
29 June 2023, 10:48 IST
US visa: 2023 సంవత్సరంలో భారతీయులకు కనీసం 10 లక్షల వీసాలను ప్రాసెస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ వెల్లడించారు. వీసా ప్రాసెసింగ్ టైమ్ గణనీయంగా పెరిగిందని, తొలి సారి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారి వెయిటింగ్ టైమ్ ను ఇప్పటికే 50% వరకు తగ్గించామన్నారు.
ప్రతీకాత్మక చిత్రం
US visa: 2023 సంవత్సరంలో భారతీయులకు కనీసం 10 లక్షల వీసాల (US Visa)ను ప్రాసెస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ వెల్లడించారు. వీసా ప్రాసెసింగ్ టైమ్ గణనీయంగా పెరిగిందని, తొలి సారి వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారి వెయిటింగ్ టైమ్ ను ఇప్పటికే 50% వరకు తగ్గించామన్నారు.
10 లక్షల వీసాలు
భారత్ లోని అమెరికన్ ఎంబసీలు 2023 సంవత్సరంలో కనీసం 10 లక్షల వీసాలను ప్రాసెస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ వెల్లడించారు. ఇప్పటికే ఆ లక్ష్యంలో సగం, అంటే, సుమారు 5 లక్షల వీసాల ప్రాసెసింగ్ ను సాధించామన్నారు. ఐఐటీ ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇప్పటికే వీసా ప్రాసెసింగ్ లో వేగం పెంచామని, గతంలో ఎన్నడూ లేనంత వేగంగా వీసాల జారీ కొనసాగుతోందని వివరించారు. తొలిసారి టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారి ఇంటర్వ్యూ వెయిటింగ్ టైమ్ ను 50% వరకు తగ్గించగలిగామన్నారు.
వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు
చాలా కేటగిరీలకు వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలకు హాజరు అవ్వాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఇచ్చామని భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ గుర్తు చేశారు. వీసా ప్రాసెసింగ్ విధుల్లో ఉన్న సిబ్బంది సంఖ్యను కూడా గణనీయంగా పెంచామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా.. హెచ్ 1 బీ వీసాదారులకు అమెరికా శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. హెచ్ 1 బీ వీసాదారులు తమ వీసా రెన్యువల్ కోసం ఇకపై భారత్ కు రావాల్సిన అవసరం లేకుండా, అమెరికాలోనే రెన్యువల్ చేసుకునేలా నిబంధనలను అమెరికా సవరించింది. అలాగే, బెంగళూరు, అహ్మదాబాద్ ల్లో కొత్తగా అమెరికా కాన్సులేట్లను ప్రారంభించనుంది. అలాగే, భారత్ ఈ సంవత్సరం అమెరికాలోని సియాటెల్ లో కొత్తగా కాన్సులేట్ ను ప్రారంభించనుంది.