US visa application: యూఎస్ వీసా ఆన్ లైన్ ఫామ్స్ ను ఫిలప్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి..
అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో యూఎస్సీఐఎస్ (USCIS) ఫామ్స్ ను ఆన్ లైన్ లో కూడా ఫైల్ చేయవచ్చు. కానీ, అలా ఆన్ లైన్ లో ఆ ఫామ్స్ ను ఫిల్ చేస్తున్న సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరి. లేదంటే, మీ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అయ్యే చాన్స్ ఉంటుంది.
ప్రతీకాత్మక చిత్రం (AP)
అమెరికా వీసా (US Visa) దరఖాస్తులో భాగంగా చాలా ఫామ్స్ ను నింపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో ఆ USCIS ఫామ్స్ ను ఫిల్ చేయాలనుకుంటే.. ముందుగా వాటిని జాగ్రత్తగా చదవి, వారు ఆ ఏం అడుగుతున్నారో సరిగ్గా అర్థం చేసుకుని ఆ తరువాతనే వాటిని ఫిల్ చేయడం మంచిది. అంతకన్నా ముందు, USCIS వెబ్ సైట్ లోని సూచనలు, సలహాలను చదవాలి.
ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- దరఖాస్తు దారు సంతకం కోసం రిజర్వ్ చేసిన స్థలంలో సిగ్నేచర్ చేయడం మర్చిపోవద్దు. దరఖాస్తు దారు సంతకం లేని అప్లికేషన్ ను యూఎస్సీఐఎస్ (USCIS) రిజెక్ట్ చేస్తుంది.
- యూఎస్సీఐఎస్ (USCIS) వెబ్ సైట్ నుంచే ఫామ్స్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ ఫామ్స్ ను ఆన్ లైన్ లోనే ఫిల్ చేసి, సబ్మిట్ చేయవచ్చు. లేదా ఆ ఫామ్స్ ను డౌన్ లోడ్ చేసుకుని, ఫిల్ చేసి, వాటిని ప్రింట్ తీసుకుని, పోస్ట్ ద్వారా కూడా వాటిని పంపించవచ్చు.
- ఒకవేళ ఆన్ లైన్ లోనే ఫామ్ ను సబ్మిట్ చేసి ఉంటే, మళ్లీ దాన్ని పోస్ట్ లో పంపించాల్సిన అవసరం లేదు.
- ఫామ్ ను చేతిరాతతో ఫిల్ చేస్తే, మీ హ్యాండ్ రైటింగ్ నీట్ గా, అర్థమయ్యేలా ఉండాలి. ఫామ్ ను ఫిల్ చేయడానికి బ్లాక్ ఇంక్ పెన్ వాడాలి.
- అన్ని పేజీలు వరుస క్రమంలో ఉన్నాయో లేదో సరి చూసుకున్న తరువాతనే సబ్మిట్ చేయాలి. ప్రతీ పేజీ కింది భాగంలో ఫామ్ ఎడిషన్ డేట్, పేజ్ నెంబర్ ఉండేలా చూసుకోవాలి.
- ఏదైనా సమాచారం అవసరం లేదని ఆ ఫామ్ లో లేదా ఇన్ స్ట్రక్షన్స్ లో నిర్దిష్టంగా చెబితే తప్ప, ఏ ప్రశ్నను స్కిప్ చేయవద్దు. అన్ని వివరాలను సంపూర్ణంగా లేకపోతే, అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తప్పులు ఏమైనా చేస్తే, మళ్లీ కొత్త ఫామ్ ను తీసుకుని ఫిల్ చేయండి.
- ఫామ్ పై హై లైటర్స్ ను కానీ, టేప్స్ ను కానీ, కరెక్షన్ ఫ్లూయిడ్స్ ను కానీ వాడవద్దు.
- పేరు, పుట్టిన తేదీ.. మొదలైన వివరాలను ఎక్కువ సార్లు నింపాల్సి వస్తే, అన్ని సార్లు కూడా ఒకే ఫార్మాట్ లో వాటిని ఫిల్ చేయాలి.
- సరైన మొత్తంలో ఫీజు చెల్లించాలి. సరైన మొత్తంలో ఫీజు చెల్లించని దరఖాస్తులను రిజెక్ట్ చేస్తారు.